A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
చంద్రబాబు నోటికి ఏది వస్తే అది మాట్లాడి..
Share |
July 6 2020, 7:14 am

లాక్ డౌన్ సమయంలో పేదలకు సాయం చేసిన వైసిపి ఎమ్మెల్యేలపై కేసులు వేయించిన ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ,తను మాత్రం విజయవాడ వస్తున్నప్పుడు లాక్ డౌన్ నిబందనలను పట్టించుకోలేదని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యానించారు.చంద్రబాబుది గురువింద గింజ సామెత అని ఆయన అన్నారు.ట్విటర్ లో ఆయన వ్యాఖ్యలు చేశారు. కరోనాకు భయపడి హైదరాబాద్‌లో గడిపిన చంద్రబాబును రాష్ట్రంలోకి రాకుండా ఎవరు అడ్డుకున్నారని ప్రశ్నించారు. ‘ఈ 65 రోజుల్లో హైదరాబాద్‌లో కూర్చోకుండా రాష్ట్రానికి వస్తానంటే చంద్రబాబును ఎవరైనా వద్దన్నారా? విశాఖకు విమానాలు రద్దయితే రాష్ట్ర ప్రభుత్వంపై నిందలు వేయడం ఏంటి. రోడ్డు మార్గంలో సోమవారం ఉండవల్లి వచ్చినట్టు విశాఖపట్నం వెళ్తానంటే ఎవరు అడ్డు చెప్పారు. చంద్రబాబు నోటికి ఏదొస్తే అది మాట్లాడితే జనం నవ్వుకోరా? ప్రజలకు కష్ట కాలంలో నిత్యావసర సరుకులు అందించిన ఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేల మీద చంద్రబాబు కోర్టులో కేసులు వేయించారు. ఈ రోజు హైదరాబాద్‌ నుంచి వచ్చేటప్పడు చంద్రబాబు దారిలో లాక్‌డౌన్‌ నిబంధనలను ఉల్లంఘించారు. గురివిందకు ప్రతిరూపం చంద్రబాబు’ అని సజ్జల వ్యాఖ్యానించారు.

tags : sajjala

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info