A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
కేంద్ర మంత్రి క్వారంటైన్ కు వెళ్లక్కర్లేదా
Share |
July 6 2020, 7:11 am

కేంద్ర మంత్రి సదానంద గౌడ క్వారంటైన్ కు వెళ్లాలా? వద్దా అన్న మీమాంస జరుగుతోంది. ప్రత్యేక విమానంలో బెంగుళూరు వచ్చిన ఆయన మిగిలినవారికి మల్లే క్వారంటైన్ కు ఎందుకు వెళ్లలేదని పలువురు ప్రశ్నించడం అక్కడి ప్రభుత్వానికి ఇబ్బందిగా మారింది.దాంతో కేంద్రమంత్రికి మినహాయింపు ఇస్తూ జిఓ ఇచ్చిందట.ఈ వివాదంపై మంత్రి సదానందగౌడ స్పందించారు.తాను నిర్వహించే శాఖ అత్యవసర సేవల పరిదిలో ఉందని, అందువల్ల తనకు క్వారంటైన్ నిబందనలు వర్తించవని ఆయన తెలిపారు.బెంగుళూరు విమానాశ్రయంలో దిగిన ప్రతి ఒక్కరు క్వారంటైన్ కు వెళ్లాలని అక్కడి ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడంతో ఈ సమస్య ఎదురైంది. గౌడ మాత్రం నేరుగా తన నివాసానికి వెళ్లారు. తాను అత్యవసర సేవలకు సంబంధించిన ఔషధాల శాఖకు మంత్రినని, వాటి పంపిణీకి సంబంధించిన వ్యవహారాల్లో సకాలంలో ప్రభుత్వాలతో చర్చించాల్సిన బాధ్యత తనపై ఉందని ఆయన అన్నారు. ఆరోగ్య సేతు యాప్ లో తన వివరాలు పొందుపరిచనని, వైద్య పరీక్షలు చేయించుకుంటున్నానని వివరణ ఇచ్చారు. అన్నీ బాగుండడంతోనే ప్రత్యేక విమానంలో వచ్చానని ఆయన చెప్పారు.

tags : karnataka

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info