A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
2.40లక్షల తిరుమల లడ్డూల విక్రయం
Share |
July 6 2020, 8:52 am

ఎపిలోని వివిధ జిల్లాలలో తిరుమల లడ్డూలను భక్తులు విశేషంగా కొనుగోలు చేశారన్న సమాచారం వచ్చింది. జిల్లా కేంద్రాల్లో ఉన్న టీటీడీ కల్యాణ మండపాల్లో సోమవారం శ్రీవారి లడ్డూ ప్రసాదం విక్రయాలను ప్రారంభించారు. రూ. 50 లడ్డూను రాయితీపై ప్రస్తుతం రూ. 25కే అందజేస్తున్నారు. లడ్డూ విక్రయాలను ప్రారంభించిన మూడు గంటల్లోనే అందుబాటులో ఉన్న 2.4 లక్షల లడ్డూలను టీటీడీ విక్రయించింది. మంగళవారం మరో 2 లక్షల లడ్డూ ప్రసాదాలను జిల్లా కేంద్రాలకు తరలించనున్నారు.గుంటూరు రెడ్‌జోన్‌లో ఉండటంతో ఈనెల 30వ తేదీ నుంచి అక్కడ లడ్డూ విక్రయాలను ప్రారంభించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా భక్తుల నుంచి వచ్చిన విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకుని టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, ఈవో అనిల్‌ కుమార్‌ సింఘాల్‌ శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని అందుబాటులోకి తీసుకువచ్చారు. ఐవైఆర్ కృష్ణారావు వంటివారు దీనిని కూడా తప్పు పట్టారు.అయినా భక్తులు మాత్రం లడ్డూలు తీసుకోవడానికే ప్రాదాన్యం ఇచ్చారు.తద్వారా తిరుమలేషుని పట్ల తమ భక్తిని చాటుకున్నారు.

tags : tirumala, laddu

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info