A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
రియల్ ఎస్టేట్ ను కరోనా ముంచేసింది
Share |
July 6 2020, 7:19 am

రియల్ ఎస్టేట్ రంగాన్ని కరోనా కుదేలు చేసిందని రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ సమాఖ్య వ్యాఖ్యానించింది. 2009 నాటి ఆర్దిక మాంద్యం కన్నా కరోనా సంక్షేభమే తీవ్రంగా ఉందని ఆ సంస్థ తెలిపింది.దీనిపై ప్రదాని మోడీకి ఒక లేఖ రాసింది. కరోనా కంటే ముందు నుంచే ప్రతికూలంలో ఉన్న రియల్టీ రంగాన్ని కరోనా మరింత ముంచేసిందని పేర్కొంది. తీవ్రంగా నష్టపోయిన రియల్‌ ఎస్టేట్‌ రంగాన్ని రుణ పునర్‌వ్యవస్థీకరణ, వడ్డీ రేట్ల తగ్గింపు వంటి చర్యలతో ఆదుకోవాలని ప్రదానిని కోరింది.అర్ధంతరంగా నిలిచిపోయిన గృహ నిర్మాణ ప్రాజెక్ట్‌లను పూర్తి చేయడానికి తక్షణమే రూ.25 వేల కోట్ల నిధులను విడుదల చేయాలని లేఖలో కోరింది.‘‘వ్యవసాయం తర్వాత అతిపెద్ద ఉద్యోగ అవకాశాలు కల్పించేది రియల్టీ రంగమేనని, స్థూలజాతీయోత్పత్తి (జీడీపీ)లోనూ రియల్టీకి సింహ భాగం వాటా ఉందని, అలాంటి రంగాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. రియల్టీ మీద ఆధారపడి సిమెంట్, స్టీల్, రంగుల వంటి సుమారు 250 అనుబంధ రంగాలున్నాయని’’ లేఖలో సభ్యులు పేర్కొన్నారు. నగదు లభ్యత, ఇసుక, స్టీల్, సిమెంట్‌ వంటి నిర్మాణ సామగ్రి కొరత వంటివి ప్రధాన సవాళ్లుగా మారాయని చెప్పారు.

tags : carona

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info