A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
630 విమాన సర్వీసులు రద్దు అయ్యాయి
Share |
July 6 2020, 8:56 am

కరోనా భయంతో విమానాల రాకపోకలకు కొన్ని రాష్ట్రాలు ఆసక్తి చూపకపోవడం, కొన్ని ఎయిర్‌పోర్టుల్లో పరిమిత సంఖ్యలోనే విమానాలకు అనుమతించడంతో తొలిరోజే 630 విమానాలను రద్దు చేయాల్సి వచ్చిందని విమానయాన పరిశ్రమ వర్గాలు వెల్లడించాయి. కరోనా పాజిటివ్‌ కేసులు రోజురోజుకూ పెరిగిపోతుండడంతో పశ్చిమ బెంగాల్, ఆంధ్రప్రదేశ్‌ తదితర రాష్ట్రాలు విమానాల సర్వీసులను ఇప్పుడే ప్రారంభించడానికి విముఖత వ్యక్తం చేశాయి. అలాగే ముంబై, చెన్నై, హైదరాబాద్‌ తదితర ప్రధాన ఎయిర్‌పోర్టుల నుంచి సర్వీసుల సంఖ్యను కుదించారు. రాష్ట్రాల అభ్యంతరాలను దృష్టిలో ఉంచుకుని, కేంద్ర ప్రభుత్వ ప్రకటన మేరకు సోమవారం 630 విమానాలను రద్దు చేశారు. ఈ విషయం తెలియక చాలామంది ప్రయాణికులు ఎయిర్‌పోర్టులకు చేరుకున్నారు. విమానాలు రద్దయ్యాయని తెలిసి ఆగ్రహం వ్యక్తం చేస్తూ సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టారు.

దేశీయ విమాన సేవలు పునఃప్రారంభం అయ్యాక తొలిరోజు సోమవారం 532 విమానాలు రాకపోకలు సాగించాయని, 39,231 మంది ప్రయాణించారని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్‌సింగ్‌ పురీ చెప్పారు. మంగళవారం నుంచి దేశీయ విమాన సర్వీసులు ప్రారంభించేందుకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అంగీకరించిందని తెలిపారు. 28 నుంచి పశ్చిమ బెంగాల్‌లో విమానయాన సేవలు అందుబాటులోకి వస్తాయని అన్నారు. మున్ముందు దేశీయ విమానాలు, ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తమ రాష్ట్రాల్లోని ఎయిర్‌పోర్టులకు విమానాల్లో చేరుకునేవారి విషయంలో సొంతంగా క్వారంటైన్‌ నిబంధనలు అమలు చేస్తామని కర్ణాటక, తమిళనాడు, కేరళ, బిహార్, పంజాబ్, అస్సాం, ఆంధ్రప్రదేశ్‌ తదితర రాష్ట్రాలు ప్రకటించాయి.

tags : air india

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info