A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
లాక్ డౌన్ సొడిగిస్తే ఆర్ధిక వినాశనమే
Share |
July 6 2020, 7:22 am

ఈ నెలాఖరుకు లాక్ డౌన్ కాలపరిమితి ముగుస్తుండడంతో మళ్లీ చర్చలు రాంభం అయ్యాయి. లాక్ డౌన్ పొడిగింపు మంచిదా?కాదా అన్నదానిపై పలువురు అబిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. లాక్‌డౌన్‌ను పొడిగిస్తూ పోవడమనేది ఆర్థిక వినాశనానికి దారితీస్తుందని మహీంద్రా గ్రూప్‌ చైర్మన్‌ ఆనంద్‌ మహీంద్రా వ్యాఖ్యానించారు. దీంతో పాటు వైద్యపరంగా మరో సంక్షోభం కూడా తలెత్తుతుందని పేర్కొన్నారు. మానసిక ఆరోగ్యంపై లాక్‌డౌన్‌ ప్రతికూల ప్రభావాలు, కోవిడ్‌యేతర రోగులు నిర్లక్ష్యానికి గురయ్యే భారీ రిస్కులను గురించి తాను గతంలో ప్రస్తావించిన కథనాన్ని ఆయన గుర్తు చేశారు. కరోనా వైరస్‌ కేసులు పెరుగుతూనే ఉంటాయని, ఆస్పత్రులలో ఆక్సిజన్‌ అందుబాటులో ఉండే పడకల సంఖ్య వేగంగా, గణనీయంగా పెంచాల్సి ఉంటుందని మహీంద్రా తెలిపారు. ఆర్మీకి ఈ విషయంలో అపార అనుభవం ఉందని పేర్కొన్నారు.

tags : carona, lockdown

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info