A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
టిడిపి స్కీములను రద్దు చేయడం వైఫల్యమా
Share |
July 9 2020, 3:18 am

వైఎస్ ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం హామీలను నెరవేర్చడంలో విఫలం అయిందని టిడిపి ఆరోపించింది. ఆ పార్టీ ఎపి అద్యక్షుడు కళా వెంకటరావు ఈ విషయమై ఒక ప్రకటన చేశారు. ఎన్నికల హామీలను వైసిపి ప్రభుత్వం నీరు కార్చిందని విమర్శించారు. అహంకారం, నియంతృత్వం, ప్రతీకారం మాత్రమే ఈ ఏడాదిలో జగన్‌ సాధించిన విజయాలని ఆయన అన్నారు.గత ప్రభుత్వం కన్నా ఈ ఏడాదిలో రూ.30 వేల కోట్ల అదనపు ఆదాయం వచ్చినా రాష్ట్రంలో చేసిన అభివృద్ధి శూన్యమని ఆయన చెప్పారు. అన్న క్యాంటీన్లు, చంద్రన్న బీమా, రైతు రుణ మాఫీ, పండగ కానుకలు, నిరుద్యోగ భృతి, ఇంటర్‌ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం, ఆదరణ వంటి 34 పథకాలను వైసీపీ ప్రభుత్వం రద్దు చేసిందని ఆయన అంటున్నారు.

తెలుగుదేశం స్కీములు కొనసాగిస్తామని వైసిపి హామీ ఇచ్చిందా?30వేల కోట్ల అదనపు ఆదాయం ఎలా వచ్చింది. అంటే చంద్రబాబుది చాతకాని ప్రభుత్వం అని కళా వెంకటరావు చెబుతున్నారా?

tags : kala

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info