A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఐవైఆర్ కృష్ణారావు 2 రకాలుగా మాట్లాడారా
Share |
July 6 2020, 9:00 am

ప్రభుత్వ మాజీ ప్రదాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు టిటిడి ఆస్తుల వేలం , లడ్లూల అమ్మకంపై స్పందించిన తీరు కొంత చిత్రంగానే ఉంది. దాతలు ఇచ్చిన ఆస్తులు అమ్మాలన్న నిర్ణయం సరికాదని అన్నారు. ప్రస్తుతం దేశంలో రియల్ ఎస్టేట్ రంగం దెబ్బతిన్నదని, అలాంటి సమయంలో అమ్మడం ఏమిటని అన్నారు. ఇంతకీ కృష్ణారావు అమ్మకానికి వ్యతిరేకమా? లేక ఇప్పుడు అమ్మడానికి వ్యతిరేకమా? రియల్ ఎస్టేట్ పడింది కనుక ఇప్పుడు అమ్మవద్దంటే తప్పు లేదు. కాని ఆయన రెండు మాటలూ చెప్పారు.దాతలు ఇచ్చిన ఆస్తులు అమ్మడం ఏమిటని అన్నారు.మరి దాతలు ఇచ్చిన ఆస్తులు వేరేవారు కబ్జా చేస్తే ఫర్వాలేదా? ఆ ఆస్తి అమ్మి వీరు నమ్మే దేవుడి ఖాతాలో వేయడం మంచిది కాదా? హిందూ మత ఉద్దారణ అంటే దేవుడి ఆస్తి దేవుడి ఖాతాలోకి కాకుండా వ్యక్తుల ఖాతాలలోకి పడుతుంటే చూస్తూ ఊరుకోవడమా?అంతేకాదు. కృష్ణారావు గతంలో చంద్రబాబు ప్రభుత్వంలో చీఫ్ సెక్రటరీగా ఉన్నప్పుడు టిటిడి ఆస్తుల అమ్మకంపై ఎలా తీర్మానం చేసింది? చంద్రబాబు టైమ్ లో సుమారు వంద ఆస్తులు అమ్మారని అంటున్నారు. అది నిజమైతే అప్పట్లో కృష్ణారావుకు అది తప్పుగా కనిపించలేదా?టిటిడి భోర్డులో భక్తి భావం ఉన్నవారినే నియమించాలని అన్నారు. దానికి ఏమైనా కొలమానం ఉంటుందా?ఏమిటో ఇంత మేధావులు కూడా ఇలాంటి స్టేట్ మెంట్లు ఇస్తుంటారు?

tags : ivy

Latest News
 
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info
 
window._taboola = window._taboola || []; _taboola.push({flush: true});