A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
4 లక్షల మందికి ఉద్యోగాల ఘనత జగన్ దే
Share |
July 9 2020, 5:10 am

రాష్ట్రంలో అధికారంలోకి వచ్చాక దాదాపు 4లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చిన ఘనత సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి దక్కుతుందని ఎపి మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. దేశ చరిత్రలోనే రికార్డు సృష్టించే విదంగా వైసిపి అదికారంలోకి వచ్చిందని, తదుపరి అనేక స్కీములను అమలు చేయడం జరిగిందని ఆయన అన్నారు. అమ్మఒడి ద్వారా ఏపీ అక్షరాస్యతలో కేరళను అధిగమించిందన్నారు. కరోనా సమయంలో గ్రామ వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది సేవలు మరువలేనివన్నారు. రాబోయే రోజుల్లో గ్రామ వాలంటీర్లకు సమచిత స్థానం కల్పించబోతున్నామని పేర్కొన్నారు. రాష్ట్రంలో అభివృద్ధికి చంద్రబాబు కొన్ని వ్యవస్థలను తన ఆధీనంలో ఉంచుకుని రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధికి అడుగడుగునా అడ్డు పడుతున్నారు. విద్యుత్‌ ఛార్జీలపై మాట్లాడే నైతిక హక్కు ఆయనకు లేదని విమర్శించారు. టీటీడీ ధర్మకర్తల మండలి నిర్ణయం మేరకే భూములు వేలం వేస్తున్నారు. గత ప్రభుత్వ హయంలోనే ఈ నిర్ణయం తీసుకున్నారని.. కావాలనే ఇప్పుడు దీనిని రాజకీయం చేస్తున్నారని ఆయన అన్నారు. డాక్టర్ సుధాకర్ విషయంలో టిడిపి మొసలి కన్నీరు కార్చుతోందని ఆయన అన్నారు.

tags : avatnti

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info