A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
విజయనగరం ఎమ్మెల్యే రాజీనామా సవాల్
Share |
July 9 2020, 2:51 am

విజయనగరం కార్పొరేషన్ అయిన తర్వాత పలు అబివృద్ది కార్యక్రమాలు చేపట్టామని వైసిపి ఎమ్మెల్యే కొలగొట్ల వీరభద్రస్వామి చెప్పారు. మూడులాంతర్ల జంక్షన్ లలో ఉన్న చిహ్నాలు ప్రస్తుతం భద్ర పరిచామని, అభివృద్ది కార్యక్రమాలు చేసిన తర్వాత వాటిని అదే ప్రదేశంలో పునరుద్దరిస్తామని అన్నారు. ఇది చారిత్రక కట్టడం అని కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు అంటున్నారని, ఇది చారిత్రక కట్టడం అయితే పురావస్తు శాఖ రికార్డులలో ఉందా అని ప్రశ్నించారు.అలా అని అశోక్ రుజువు చేస్తే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని ఆయన అన్నారు.గతంలో విద్యుత్ లేని సమయంలో ఆయా చోట్ల లాంతర్లు ఏర్పాటు చేసేవారని,ఇది మూడు రోడ్లు కూడలి కనుక ఇక్కడ మూడు లాంతర్లు ఏర్పాటు చేశారని, దీనిపై అశోక్, టిడిపి నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారని ఆయన అన్నారు.

tags : kolagatla

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info