A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
కెటిఆర్ వచ్చాకే చేనేత కు ఆదరణ పెరిగింది
Share |
July 9 2020, 2:54 am

*చేనేతను ఆదరించండి...నేతన్నను ఆదుకోండి*_
#ప్రజల భాగస్వామ్యం తోటే అదుకునేది
#చేనేతకు చేయూత నిచ్చింది  ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలోనే 
#ఉద్యమ సమయంలో జోలెపట్టి యాచించి నేతన్నను ఆదుకుంది ముఖ్యమంత్రి కేసీఆర్
#గత పాలకుల అలక్ష్యం తోటే చేనేత రంగం ఆగమైంది
#చేనేత రంగంలో అద్భుతమైన నైపుణ్యం తెలంగాణ సొంతం
#అగ్గిపెట్టెలో పట్టేలా చీరను నేసిన ఘనత నేతన్నది
#చేనేత కార్మికులకు పూర్వవైభవం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రణాళికలు 
#జౌళి శాఖామంత్రి గా కే టి ఆర్ వచ్చాకే చేనేతకు ఆదరణ పెరిగింది
 _*-మంత్రి జగదీష్ రెడ్డి*_ 
******************************
*లాక్ డౌన్ సమయంలో కొనుగోళ్లు పెంచేందుకు ప్రభుత్వం నిర్ణయం*
*మంత్రి జగదీష్ రెడ్డి తో సహా ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రతినిధులు భూదాన్ పోచంపల్లి లో షాపింగ్*
******************************
చేనేతకు చేయూత నిచ్చింది ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలోనే అని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు.ఉద్యమ సమయంలో నే ఉద్యమ నేతగా ముఖ్యమంత్రి కేసీఆర్ జోలె పత్తి యాచించి చేనేత కార్మికుల కు
అండగా నిలిచారని ఆయన గుర్తు చేశారు.

తెలంగాణ రాష్ట్రం వచ్చేంత వరకు ఓపిక పట్టండి... బలవన్మరణాలకు స్వస్తి పలుకండి అంటూ వారిలో నమ్మకాన్ని పెంచిన ఘనత ముమ్మాటికి ముఖ్యమంత్రి కేసీఆర్ దే నన్నారు. లాక్ డౌన్ సమయంలో అమ్మకాలు ఆగిపోయి ఆందోళన చెందుతున్న చేనేతలను ఆదుకోవడానికి గాను
ఆదివారం సాయంత్రం మంత్రి జగదీష్ రెడ్డి తో పాటు ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు
భూదాన్ పోచంపల్లిలో కుటుంబ సభ్యులతో సహా షాపింగ్  నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి జగదీష్ రెడ్డి మీడియా తో మాట్లాడుతూ అనుకున్నట్లుగానే తెలంగాణ రాష్ట్రంలో చేనేత
రంగానికి ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్ద పీట వేశారని ఆయన కొనియాడారు.
గత పాలకుల అలక్ష్యం తోటే చేనేత రంగం కునారిల్లిందని,అటువంటి పరిస్థితులనుండి బయట పడేసేందుకు
ముఖ్యమంత్రి కేసీఆర్ పడ్డ శ్రమ ఇప్పుడిప్పుడే సత్ఫాలితాలు ఇస్తుందన్నారు.
ఇటువంటి పరిస్థితుల్లో కరోనా మహమ్మారి విజృంబించడం..కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ ప్రకటించడంతో
ఏర్పడ్డ విపత్తు చేనేత రంగం మీద కూడా పడిందన్నారు.
ఆ పరిస్థితులనుండి బయట పడేసేందుకు కొనుగోళ్లు పెంచాలన్నది ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పమన్నారు.
అందుకు తోడు జౌళి శాఖామంత్రి గా కే టి రామారావు బాధ్యతలు చేపట్టాక చేనేతను ఆదరించండి...నేతన్నను
ఆదుకోండి అన్న నినాదంతో ప్రజలను భాగస్వామ్యం చేశారన్నారు.
తద్వారా కొనుగోళ్లు పెరిగి చేనేత రంగానికి టి ఆర్ యస్ పాలనలో పూర్వవైభవం సంతరించుకుందన్నారు.
చేనేత రంగంలో అద్భుతమైన నైపుణ్యం తెలంగాణ కే సొంతం అన్నారు.అగ్గిపెట్టెలో పట్టేలా నేసిన చీరను
తయారు చేసిన నేతన్న తెలంగాణ బిడ్డడు అని అందుకు గర్వపడుతున్నామన్నారు.
అందులో భాగమే ఈ సాయంత్రం భూదాన్ పోచంపల్లి లో ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజాప్రతినిధులు కుటుంబ
సభ్యులతో సహా  స్వయంగా షాపింగ్ కు వచ్చినట్లు మంత్రి జగదీష్ రెడ్డి వెల్లడించారు.
భూదాన్ పోచంపల్లి లో ఆదివారం సాయంత్రం జరిగిన షాపింగ్ లో మంత్రి జగదీష్ రెడ్డి వెంట రాజ్యసభ సభ్యులు
బడుగుల లింగయ్య యాదవ్,శాసనమండలి సభ్యులు కర్నె ప్రభాకర్ జిల్లా ప్రజాపరిషత్ చేయిర్మన్ లు
ఎలిమినేటి సందీప్ రెడ్డి,గుజ్జ దీపికా యుగంధర్ రావు లతో పాటు శాసనసభ్యులు ఫైళ్ల శేఖర్ రెడ్డి,గాధారి కిశోర్

కుమార్,కంచర్ల భూపాల్ రెడ్డి,ఎన్.భాస్కర్ రావు,నోముల నరసింహామయ్యా ,శానంపూడి సైదిరెడ్డి మాజీ
శాసనసభ్యులు కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

tags : jagadeeshreddy

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info