A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
వర్షాలు పడేవరకు ఎండలే తీవ్రం..జాగ్రత్త
Share |
July 9 2020, 3:10 am

ఈ రోజు నుంచి రోహిణీ కార్తె ప్రవేశిస్తోంది. ఎండలు మరింతగా మండే అవకాశం ఉంది. ఈనెల 25 నుంచి 28వ తేదీ వరకు రాష్ట్రంలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని, వడగాడ్పులు వీస్తాయని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) ప్రకటించింది.దీంతో ప్రజలతా జాగ్రత్తగా ఉండాలని ఐఎమ్ డి పేర్కొంది. ‘రాబోయే నాలుగు రోజులే కాదు. నైరుతి రుతు పవనాలు వచ్చే వరకూ చాలా రోజులు అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. వడగాడ్పుల బారిన పడకుండా ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందే’ అని వాతావరణ నిపుణులు సూచించారు. ఆదివారం గుంటూరు జిల్లాలోని రెంటచింతలలో నిప్పుల కొలిమిని తలపిస్తూ గరిష్ట ఉష్ణోగ్రత 47.3 డిగ్రీలు నమోదైంది. మే 25న ఉభయ గోదావరి జిల్లాలతో పాటు ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కడప, కర్నూలు జిల్లాల్లో పలు చోట్ల 44 నుంచి 46 డిగ్రీలు, శ్రీకాకుళం, విశాఖపట్నం, కృష్ణా, గుంటూరు, అనంతపురం జిల్లాల్లో అక్కడక్కడా 41 నుంచి 43 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయి.

tags : hot son

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info