A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఈ ఎమ్.పి వైసిపికి ద్రోహం చేయడం లేదుకదా!
Share |
July 9 2020, 3:39 am

ఈ వైసిపి ఎమ్.పికి ఏదో అయింది. గతంలో కూడా ఈయన కొంత తేడాతో ఉన్నారని ప్రచారం జరిగింది.మరి టిడిపి మీడియాలో వచ్చిన వార్తలు నిజమే అయితే నర్సాపురం ఎమ్.పి రఘురామకృష్ణంరాజు పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వచ్చే అవకాశం ఉంది. టిటిడి భూముల విషయంలో ఆయనకు ఏదైనా తేడా ఉంటే ముందుగా టిటిడి చైర్మన్ సుబ్బారెడ్డితో మాట్లాడుకోవచ్చు. ఆ తర్వాత దేవాదాయ శాఖ మంత్రితో మాట్లాడవచ్చు. అంతగా కాకపోతే ముఖ్యమంత్రితో మాట్లాడవచ్చు.కాని ఈయన మాట్లాడిన తీరు పార్టీని ఇబ్బందిలో పెట్టాలని అన్నట్లుగా ఉంది. నిరర్ధక ఆస్తుల పేరుతో భూముల వేలం వేయాలని టిటిడి నిర్ణయం భక్తుల మనోభావాలను దెబ్బతీయమేనని ఆయన తేల్చారట.గత ప్రభుత్వం చేసిన తప్పులు సరిచేయాల్సింది పోయి అదే తప్పు చేయాలని అనుకోవడం సరికాదని చెప్పారట. ఆస్తుల అమ్మకం భగవంతుడికి టిటిడి చేస్తున్న ద్రోహం అని ఎంపీ తప్పుబట్టారు. దాతలు ఇచ్చిన ఆస్తుల పరిరక్షణకు పాలకమండలి పనిచేయాలని రఘురామకృష్ణం రాజ అన్నారు. ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లానని చెప్పారట.

టిటిడికి ద్రోహం పేరుతో రఘురామకృష్ణంరాజు తనకు ఎమ్.పి అయ్యే అవకాశం ఇచ్చిన వైఎస్ ఆర్ కాంగ్రెస్ కు ద్రోహం చేస్తున్నారన్న విమర్శలు వచ్చే అవకాశం ఉంది కదా!

tags : raghuramakrishnamraju

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info