A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
పవన్ కళ్యాణ్ కూడా మాట్లాడారు
Share |
July 9 2020, 4:55 am

జనసేన అదినేత పవన్ కళ్యాణ్ కూడా అదే బాటలో మాట్లాడారు.ఇతర రాష్ట్రాలలోని టిటిడి ఆస్తుల అమ్మకం ప్రతిపాదనపై ఆయన స్పందించారు. స్వామివారికి భక్తులు సమర్పించే ఆస్తులు నిరర్దకం అనడం దాతలను అవమానించడమని ఆయన తేల్చారు.
ఆస్తులను ధర్మ ప్రచారానికి, ధార్మిక కార్యక్రమాల నిర్వహణకు, ఇతర సేవా కార్యక్రమాలకు వినియోగించాలే తప్ప.. విక్రయించడం సరికాదని అభిప్రాయపడ్డారు. ఇతర రాష్ట్రాలలో చిన్న,చిన్న విస్తీర్ణాలలో ఉన్న ఆస్తులను టిటిడి ఎందుకు కాపాడుకోలేదని ఆయన అన్నారు. ఇవాళ టిటిడిచ రేపు ఇతర ఆలయాల ఆస్తులను కూడా అంగట్లో పెట్టేస్తారా అని ప్రశ్నించారు.

గతంలో దేవాలయ భూములు అమ్మిన సంగతి పవన్ కళ్యాణ్ కు తెలియదా?చంద్రబాబు టైమ్ లో ఎందుకు ఈ విషయాలేవీ ప్రస్తావించలేదు?ప్రస్తుత ప్రభుత్వంపై ఉన్న ద్వేషంతో ఇలా మాట్లాడుతున్నారా?

tags : pawankalyan

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info