A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
చంద్రబాబుకు వైసిపి ఎమ్.పి సవాల్
Share |
July 9 2020, 3:42 am

టిడిపి ఆరోపణలపై బాపట్ల ఎమ్.పి నందిగం సురేష్ స్పందించారు. తాను రాజధాని ప్రాంతంలో ఎక్కడైనా భూములు కబ్జా చేసినట్లు రుజువు చేస్తే తన పదవికి రాజీనామా చేస్తానని ఆయన సవాల్ విసిరారు. తనపై చేసిన ఆరోపణలను నిరూపించపోతే చంద్రబాబు నాయుడు రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. రాజధానిలో తానూ తన అనుచరులు భూమిని కబ్జా చేశారని తెలుగుదేశం పార్టీ తప్పుడు ప్రచారం చేస్తోందనిఅన్నారు. ఎప్పుడూ అబద్ధాలతో బతికే చంద్రబాబుకు నిజ నిర్ధారణ కమిటీ వేసి అర్హత లేదని అన్నారు. నిజ నిర్ధారణ కమిటీ వేయాల్సింది చంద్రబాబు నాయడు గత ఐదేళ్ల పాలనపైన అని, అప్పుడే చంద్రబాబు, లోకేష్ రాజధాని పేరుతో దోచేసిన భూములు బయటపడతాయని పేర్కొన్నారు. టీడీపీ నేతలు పంట పొలాలు తగలబెట్టి తనపై అనేక తప్పుడు కేసులు పెట్టారు. ఆ కేసులో వైఎస్‌ జగన్‌ పేరు చెప్పమని పోలీసులు తలమీద తుపాకీ పెట్టినప్పుడే భయపడలేదు. ఇప్పుడు చంద్రబాబుకు నేను ఎందుకు బయపడతానని సురేష్ వ్యాఖ్యానించారు. ఎల్లో మీడియా దుర్మార్గంగా విష ప్రచారం చేస్తోందని ఆయన మండిపడ్డారు.

tags : nandigam, suresh

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info