A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
రేపటి నుంచి విమానాలు పెరుగుతాయి
Share |
July 9 2020, 4:56 am

హైదరాబాద్ నుంచి ఈ రోజు 19 విమానాలు నడిచాయని, రేపటి నుంచి విమానాల సంఖ్య పెరగవచ్చని ప్రభుత్వ ప్రదాన కార్యదర్శి సోమేష్ కుమార్ చెప్పారు. ప్రయాణికులు లేక కొన్ని విమానాలు రద్దు అయ్యాయని ఆయన చెప్పారు.కరోనా లక్షణాలు లేని విమాన ప్రయాణికులకు క్వారంటైన్ ఉండదని ఆయన తెలిపారు. ప్రయాణికుల వివరాలు తమ వద్ద ఉంటాయని, ఏదైనా అవసరం అయితే వారితో మాట్లాడతామని ఆయన అన్నారు. శంషాబాద్ విమానాశ్రయం సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు.కరోనా లక్షణాలు కనిపిస్తే అన్ని రకాల పరీక్షలు చేస్తామని తెలిపారు. ప్రయాణికుల వద్ద తప్పకుండా ఆరోగ్య సేతు యాప్ ఉండాలని సూచించారు. అన్ని నాన్ టచ్ విధానంలో జరుగుతున్నాయని సి.ఎస్.వివరించారు.

tags : someshkumar

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info