A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
సుప్రింకోర్టు-ఇంగిత జ్ఞానం-మినహాయింపు!
Share |
July 9 2020, 3:44 am

ప్రత్యేక విమానాలు పంపించి విదేశాలలో ఉన్న భారతీయులను రప్పించడంలో బౌతిక దూరం పాటించాలని ,అందుకోసం విమానాలలో సీట్లలో మద్య సీట్లను ఖాళీగా ఉంచాలని సుప్రింకోర్టు ఆదేశించిందన్న వార్త వచ్చింది.కరోనా వైరస్ కట్టడి కోసం బౌతిక దూరం పాటించడం ఇంగిత జ్ఞానం అని కోర్టు వ్యాఖ్యానించిందని వార్తలు సూచించాయి. అయితే వచ్చే పది రోజులు మాత్రం మద్య సీట్లను కూడా నింపి కార్యకలాపాలు జరుపుకోవచ్చని సుప్రింకోర్టు తెలిపింది.ఎయిర్ ఇండియాకు ఈ మేరకు వెసులుబాటు కల్పించింది.అంతర్జాతీయ విమాన ప్రయాణాలను ఉద్దేశించి మాత్రమే సుప్రీం ఈ వాఖ్యలు చేసింది.
సీట్లను ఖాళీగా ఉంచడం కంటే, పరీక్షలు చేయడం, క్వారంటైన్ లో ఉంచడమే మంచి విధానమని, జూన్ 16 వరకు బుకింగ్స్ పూర్తయ్యాయని ఎయిరిండియా, ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టుకు తెలిపారు. విమానంలో ఉన్నానని, ఇతరులకు సోకకూడదని వైరస్ కు తెలుస్తుందా?పక్కపక్కనే కూర్చుంటే ప్రభావం ఉండదా అంటూ, మెహతా అభ్యర్థనను తిరస్కరిస్తూ, కొన్ని రోజుల పాటు వెసులుబాటు మాత్రమే కల్పించారు. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా విమాన ప్రయాణాలకు సంబంధించిన మార్గదర్శకాల్లో మార్పుల గురించి ఆలోచించాలన్నారు.
ఇది కూడా ఆశ్చర్యంగానే ఉంది. బౌతిక దూరం పాటించడం ఇంగిత జ్ఞానమే.కాని పది రోజులు పాటు మినహాయింపు అంటే ఆ రోజులలో ఇంగిత జ్ఞానం లేకపోయినా పర్వాలేదని కోర్టు భావిస్తుందా అన్న ప్రశ్న వస్తుంది.

tags : supremecourt,

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info