A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
నా స్థాయి నుంచి అవినీతి ఆస్కారం ఉండరాదు-జగన్
Share |
July 9 2020, 4:59 am

నా లెవెల్ నుంచి కలెక్టర్ లెవెల్ వరకు, అలాగే మండల వ్యవస్థ నుంచి కింద ఉన్న సాదారణ ఉద్యోగి వరకు అవినీతి అనేది ఉండరాదని ముఖ్యమంత్రి జగన్ అన్నారు. సచివాలయ, వలంటీర్ల వ్యవస్థలపై జరిగిన సదస్సు సందర్భంగా అవినీతి నిర్మూలన, పారదర్శకత గురించి మాట్లాడారు.అవినీతి,పారదర్శకత అన్నది తనవద్ద నుంచి మొదలైతే, కలెక్టర్ స్థాయి నుంచి మొదలైతే ఏభై శాతం అవినీతి తగ్గిపోతుందని, అలాగే కిందస్థాయిలో బాద్యులు అవినీతి చేయకపోతే మిగిలిన ఏభై శాతం అవినీతి పోతుందని జగన్ అన్నారు. ఈ దిశగా తమ ప్రయత్నాలు సాగుతున్నాయని అన్నారు.గతంలో టెండర్లు ఎలా అవినీతి చేయాలా అన్న విధంగా ఆలోచనలు ఉండేవని, ఇప్పుడు తమ ప్రభుత్వం రివర్స్ టెండరింగ్, ఇతర పద్దతుల ద్వారా 2080 కోట్ల రూపాయలు ఆదా చేశామని అన్నారు.దీని ద్వారా అవినీతి లేకుండా చేశామని అన్నారు. ఎసిబి అవినీతిపరులకు వణుకు పుట్టిస్తోందని అన్నారు.అలాగే టోల్ ప్రీ నెంబర్ ఇచ్చి అవినీతి లేకుండా చేస్తున్నామని జగన్ అన్నారు.ఇసుక, మద్యం విషయంలో అక్రమచర్యలకుపాల్పడితే కఠిన చర్యలుతీసుకునేలా చర్యలు చేపట్టామని ఆయన అన్నారు.గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి ఇక్కడే ఉండేవారు..ఆయన ఇంటి చెంతనే వందల లారీలు ఇసుక అక్రమంగా పోయేది అని ఆయన అన్నారు.దీనిని అరికట్టడానికి ఐపిఎస్ అదికారుల నేతృత్వంలో టీమ్ ఏర్పాటు చేశామని, వారైతే అవినీతి తాట తీస్తారని ముఖ్యమంత్రి అన్నారు.

tags : jagan, coruption

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info