A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
10240 మందికి పరీక్షలు-44 మందికి కరోనా
Share |
July 9 2020, 5:00 am

ఎపిలో గత ఇరవై నాలుగు గంటలలో 10240 కరోనా పరీక్షలు జరగ్గా, 44 మందికి కరోనా పాజిటివ్ నిర్దారణ అయిందని ఆరోగ్య శాఖ బులెటిన్ లో తెలిపింది. రాష్ట్రంలో కరోనా బారిన పడిన వారి సంఖ్య 2,671కి చేరింది. కొత్తగా నమోదైన కేసుల్లో చిత్తూరులో 5, నెల్లూరులో 2 మొత్తంగా ఏడుగురు కోయంబేడు (తమిళనాడు) నుంచి వచ్చిన వలస కార్మికుల్లో నమోదయ్యాయి. ఈ రోజు ఒక్కరోజే 41 మంది కోలుకుని ఇళ్లకు వెళ్లిపోయారని, ఎటువంటి మరణాలు నమోదు కాలేదని పేర్కొంది. 1,848 మంది వైరస్‌ బారినుంచి కోలుకుని డిశ్చార్జ్‌ అయ్యారు. ప్రస్తుతం 767మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతుండగా మొత్తం 56మంది మరణించారు.

tags : ap, carona

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info