A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
దేశచరిత్రలోనే ఇన్ని ఉద్యోగాలు ఇవ్వలేదేమో-జ.గన్
Share |
July 9 2020, 3:47 am

ఈ ఏడాది కాలంలో ప్రబుత్వం చేసిన కార్యక్రమం ఏమిటంటే పాలనను, సేవలను ప్రజల గడప వద్దకు తీసుకు వెళ్లామని ఎపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చెప్పారు. మన ప్రణాళిక-మీ సూచనలు కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. 11162 గ్రామ సచివాలయాలు, ప్రతి సచివాలయంలో పది నుంచి పన్నెండు మందికి ఉద్యోగాలు ఇచ్చామని, తద్వారా లక్షా ముప్పై ఐదువేల మందికి ఉద్యోగావకాశాలు కల్పించామని, దేశ చరిత్రలో ఇంత మందికి ఉద్యోగాలు ఇచ్చిన చరిత్ర ఇంకెక్కడ ఉండకపోవచ్చని అన్నారు. ఈ ఉద్యోగాలలో ఎస్సి,బిసి, మైనార్టీలకు పలు అవకాశాలు వచ్చాయని అన్నారు.ఎవరికైతే ఈ ఉద్యోగాలు అవసరమో వారికి ఈ సచివాలయాలు, వలంటీర్లలో వచ్చాయని,ఇది దేవుడిచ్చిన అవకాశం కావచ్చని ఆయన అన్నారు. రెండు వ్యవస్థలలో కలిపి నాలుగు లక్షల ఉద్యోగాలు కల్పించామని, వారితో ప్రజలు సంతృప్తి కలిగించే విదంగా పనిచేయించగలుగుతున్నామని ఆయన చెప్పారు.
ప్రజలకోసం ఏర్పాటు చేసిన సచివాలయ, గ్రామ వలంటీర్ల వ్యవస్తలు తమకు ఎంతో సంతృప్తి కలిగించాయని జగన్ తెలిపారు. కులం చూడడం లేదు. మతం చూడడం లేదు. ప్రాంతం చూడడం లేదు. రాజకీయం చూడడం లేదు..ఈ వ్యవస్తల ద్వారా గ్రామాలలోని వారికి సేవలు అందిస్తున్నారని ఆయన అన్నారు.

tags : jagan

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info