A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
మళ్లీ టిడిపి నేత కూన రవికుమార్ దూషణలు
Share |
July 9 2020, 5:04 am

టిడిపి మాజీ ఎమ్మెల్యే, మాజీ విప్ కూన రవికుమార్ తన నోటిదురుసును ప్రదర్శించారని వార్త వచ్చింది. ఈసారి ఆయన పొందూరు తహశీల్దార్ టి.రామకృష్ణను బూతులు తిట్టారట.ఈ మేరకు కూన రవికుమార్ పై కేసు నమోదు అయింది. ఆయనను అరెస్ట్ చేసేందుకు పోలీసులు రంగం సిద్ధం చేశారు. సోమవారం ఉదయం అరెస్ట్‌ చేసేందుకు రవికుమార్‌ ఇంటిని పోలీసులు చుట్టుముట్టారు. అర్ధరాత్రే ఇంటి నుంచి వెళ్ళిపోయినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈ నెల 16న గోరింట గ్రామంలోని రామసాగరం చెరువులో రవికుమార్‌ సోదరుడికి చెందిన రెండు జేసీబీలు, నాలుగు టిప్పర్లతో మట్టిని అక్రమంగా తవ్వుతుండగా వీఆర్‌ఓ నుంచి ఫిర్యాదు రావడంతో తహసీల్దార్‌ అక్కడకు చేరుకుని వాహనాలను సీజ్‌ చేశారు. దీంతో రవికుమార్‌ తహసీల్దార్‌కు ఫోన్‌చేసి బెదిరించారు. ‘వాహనాలు విడిచిపెట్టు.. లేకపోతే లంచం డిమాండ్‌ చేశావని నీ మీద కంప్లైంట్‌ చేస్తాను’ అని ‘కూన’ బెదిరించారు. ‘నా చేతిలో ఏం లేదు. సీజ్‌ చేసి అప్పగించేశాను’ అని తహసీల్దార్‌ చెప్పడంతో.. ‘కూన’ దుర్భాషలాడుతూ.. ‘నువ్వు సీజ్‌ చేశావుగానీ కంప్లైంట్‌ చేయలేదని నాకు తెలుసు. చెప్పు ఎంత కావాలి.. పది వేలు కావాలా, లక్ష కావాలా ఎంత కావాలి’ అని రవికుమార్ పేర్కొన్నారని సమాచారం. కాగా రవికుమార్ రాక్షసత్వంతో వ్యవహరిస్తున్నారని, అదికారుల పట్ల చులకన ఉంటారని తహశీల్దార్ రామకృస్ణ చెప్పారు.

tags : kuna

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info