A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
నవరత్నాలు కాదు..నవమోసాలు-యనమల
Share |
July 9 2020, 5:06 am

వైఎస్ ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసిన నవరగ్నాలు నవమోసాలు అని తెలుగుదేశం విమర్శించింది. ఆ పార్టీ సీనియర్ నేత, శాసనమండలిలో ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు ఒక ప్రకటన చేస్తూనవరత్నాలు నవ మోసాలుగా చేసినందుకు 100 మార్కులా అని ప్రశ్నించారు.వైసిపి ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటీ నెరవేర్చలేదని ఆరోపించారు. ఉన్న స్కీములు రద్దు చేసి పేర్లు మార్చారే తప్ప కొత్తగా ఇచ్చింది శూన్యమని అన్నారు. తప్పుడు కేసులతో అన్ని వర్గాల ప్రజలను క్షోభ పెట్టారని అన్నారు.. 100శాతం సంతృప్తి అని, నూరు మార్కులని నిస్సిగ్గుగా మాట్లాడుతున్నారని ఆయన అన్నారు. ఏ సమయంలో సంబరాలు జరపాలో ఇంగితజ్ఞానం కూడా వారికి లేదని, ప్రజలు కష్టాల్లో ఉంటే సంబరాలు జరపడం శాడిజం కాదా అని యనమల అన్నారు.

tags : yanamala

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info