A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
వానాకాలం నుంచి పంటల పూర్తి వివరాలు
Share |
July 9 2020, 3:53 am

వానాకాలం నుండి పంటల వివరాలు పూర్తి స్థాయిలో నమోదు
- పంటల వివరాలు రిమోట్ సెన్సింగ్ ద్వారా  పంటల వివరాలన్నీ వివిధ రంగులతో గుర్తించి .. ఏ సర్వే నంబరులో ఎంత
పంట సాగులో ఉందో గుర్తించే నైపుణ్యం దీనికి ఉంది
- క్రాప్ కటింగ్ ఎక్స్ పరిమెంట్ డాటా రిమోట్ సెన్సింగ్ తో అనుసంధానం చేస్తే వచ్చే పంట ఉత్పత్తి కూడా అంచనా
వేస్తుంది. .. 95 శాతం వాస్తవ సమాచారం ఇస్తుంది
- సమగ్ర వ్యవసాయ అమలు విధానం అమలుకు Telangana State Remote Sensing Application Centre
(TRAC) ను  అనుసంధానం చేసేందుకు కొనసాగుతున్న కసరత్తు
- నేలల స్వభావాన్ని అంచనా వేసే సామర్ధ్యం ఉన్న ట్రాక్
- భూసార పరీక్షల వివరాలను (soil health card) అనుసంధానం చేస్తే ఏ భూమిలో ఎంత మొత్తం ఎరువులు వాడాలో
తెలిపే సాంకేతికత దీని సొంతం
- రాష్ట్రంలోని 56 లక్షల పైచిలుకు రైతు కుటుంబాలకు సాగుకు యోగ్యమయిన కోటీ 60 లక్షల ఎకరాల భూమికి ఎకరా
ఎకరాలో ఏ రకమైన ఎరువులు వాడాలి ?  సీజన్ ను బట్టి ఎంత మొత్తం మోతాదు మార్చాలో సూచిస్తుంది
- ఇక ప్రతి సీజన్ లో వ్యవసాయ శాఖ క్షేత్ర స్థాయిలో సేకరించిన వివరాలు రిమోట్ సెన్సింగ్ వివరాలతో అనుసంధానం
- రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారితో భేటీ అయిన ట్రాక్ తెలంగాణ అడిషనల్  డైరెక్టర్ జనరల్ 
శ్రీనివాస్ రెడ్డి గారు
-  ఈ అద్భుతమయిన సాంకేతిక విధానాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేసే విషయమై
పూర్తి స్థాయి నివేదిక తయారు చేసి  ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి అందజేస్తామని వెల్లడించిన రాష్ట్ర వ్యవసాయ శాఖా
మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి

tags : crops

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info