A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
టి. నీటి ప్రాజెక్టులపై ఎపి సమాఖ్య పిర్యాదు
Share |
July 9 2020, 3:55 am

తెలంగాణ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా ఎపి సాగునీటి సంఘాల సమాఖ్య కేంద్ర ప్రభుత్వానికి ఒక లేఖ రాసింది.కృష్ణా నదిపై తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తున్న అక్రమ ప్రాజెక్టులను నిలుపుదల చేయాలని సమాఖ్య కోరింది. సీడబ్ల్యూసీ, కేంద్ర జలవనరుల శాఖ అపెక్స్ కౌన్సిల్, కృష్ణానది యాజమాన్య బోర్డు నుంచి అనుమతులు లేకుండా చేపట్టిన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల 90 టీఎంసీలు, దిండి 30 టీఎంసీలు, మిషన్ భగీరథ 20 టీఎంసీలు, భక్త రామదాసు 6 టీఎంసీలు, తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకాలను నిలిపివేయాలని లేఖలో కోరారు.ఎస్.ఎల్ బిసి , కల్వకుర్తి, నెట్టెంపాడు తదితర పథకాల విస్తరణకు 105 టీఎంసీల సామర్థ్యంతో మొత్తం 250 టీఎంసీలతో ప్రాజెక్టులు పూర్తయితే శ్రీశైలం దిగువన ఉన్న నాగార్జున సాగర్ కుడికాలువ కింద గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో ఉన్న 11.74 లక్షల ఎకరాలు, ఎడమ కాలువ కింద కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఉన్న 3.97లక్షల ఎకరాలు కలిపి మొత్తం 15.71లక్షల ఎకరాల ఆయకట్టు బీడుగా మారే ప్రమాదం ఉందని సమాఖ్య ఆందోళన వ్యక్తం చేసింది. దిగువ ప్రాంతమైన ఎపి హక్కులను కాపాడాలని కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర షెకావత్ ను సమాఖ్య కోరింది.

tags : srisailam

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info