A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
టిటిడి ఆస్తుల అమ్మకం తీర్మానం 2015లోనే
Share |
July 9 2020, 3:56 am

తిరుమల తిరుపతి దేవస్థానం భూములు పై ఎల్లో మీడియా, బీజేపీ, టీడీపీ దుస్ప్రచారం చేస్తున్నాయని విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే,బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ మల్లాది విష్ణు అన్నారు. 2015లో చంద్రబాబు ప్రభుత్వంలో ఆస్తులు అమ్మాలని అని బోర్డు తీర్మానించిందన్నారు. ఇప్పుడు అదే టీడీపీ గగ్గోలు పెడుతోందని ఆయన విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం ఏ పని చేస్తున్న టీడీపీ,బీజేపీ విమర్శలు చేస్తున్నాయని,వాటిని ప్రజలు నమ్మరని ఆయన అన్నారు. దేవుని భూములను రాష్ట్ర ప్రభుత్వం పరిరక్షిస్తుందని మల్లాది విష్ణు చెప్పారు. ప్రజల ఆరోగ్యం పట్ల ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహిస్తుందని విష్ణు అన్నారు. సెంట్రల్ నియోజకవర్గం లోని వివిధ వ్యాధులతో బాధపడుతున్న వారికి సీఎం సహాయనిధి చెక్కులను ఆయన పంపిణీ చేశారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో నాడు-నేడు కార్యక్రమం నిర్వహిస్తున్నామని, వచ్చేనెల 1న కొత్త 108 వాహనాలు ప్రభుత్వం ప్రారంభిస్తుందని తెలిపారు.

tags : vishnu

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info