A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
వారం రోజుల్లో కరోనా నియంత్రణ-మంత్రి
Share |
May 27 2020, 1:17 am

వచ్చే వారంరోజుల్లో కరోనా కేసులు నియంత్రణలోకి వచ్చి జిల్లా సాధారణ స్థితికి వస్తుందని రాష్ట్ర జలవనరులశాఖ మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌ అన్నారు. నెల్లూరులో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. సూళ్లూరుపేటలో నమోదైన కరోనా పాజిటివ్‌ కేసులకు రెండోసారి కూడా పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు. క్వారంటైన్‌ కేంద్రాల్లో మంచి భోజనం, వసతి కల్పించాలన్నారు. జిల్లాలో కరోనా కేసులు తగ్గుతున్న నేపథ్యంలో మరో 90 కేసులు కోయంబేడు మార్కెట్‌ లింకులతో వచ్చాయన్నారు. వీటిలో 70 కేసుల వరకు సూళ్లూరుపేట పట్టణంలోనే ఉన్నాయన్నారు. అధికారులు తీసుకున్న చర్యలు, డాక్టర్లు చేస్తున్న నాణ్యమైన వైద్యం వల్ల రోగులు త్వరితగతిన కోరుకుంటున్నారని తెలిపారు.
కలెక్టర్‌ శేషగిరిబాబు మాట్లాడుతూ వలస కార్మికులకు ఆశ్రయం కల్పించడంతోపాటు వారిని స్వస్థలాలకు పంపేందుకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. క్వారంటైన్‌ కేంద్రాల్లో ఉన్న మొదటి, ద్వితీయ కాంటాక్ట్‌ అయిన వ్యక్తులకు త్వరితగతిన వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయాలని అధికారులకు సూచించారు. పరీక్షల్లో నెగటివ్‌ వచ్చిన వారిని ఇంటికి పంపాలని తెలిపారు.

tags : anil yadav

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info