A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
అన్నదాత ఆత్మగౌరవంతో బతకాలి
Share |
September 22 2020, 9:33 am

నియంత్రిత వ్యవసాయ సాగు విధానంపై జిల్లా స్థాయి అవగాహన సదస్సు.
* ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి హరీష్ రావు.
మంత్రి హరీష్ రావు కామెంట్స్
* సాగు లాభసాటిగా మారాలని, అన్నదాత ఆత్మగౌరవంగా బతకాలని కొత్త విధానం తీసుకొచ్చారు.
* ప్రస్తుత ప్రతిపక్షాలు అధికారంలో ఉన్నప్పుడు, విత్తనాలు, ఎరువుల కొరత, విద్యుత్ కోత.
* 1.40లక్షల ఎకరాలకు 14వేల కోట్ల రూపాయలు రైతు బంధు కింద ఇస్తాం.
* వానాకాలం పంటకు సంబంధించిన 7వేల కోట్ల రూపాయల్లో 3500కోట్లు ఇప్పటికే వ్యవసాయ శాఖ ఖాతాలో జమ చేశాం.
* వానా కాలంలో మక్కల దిగుబడి తక్కువగా వస్తుంది. అది దిగుబడి వచ్చే సమయంలో వర్షం వస్తుంది. అందుకే
వేసవిలో మక్కలు వేసుకోవాలి అని చెబుతున్నాం.
* ఈ సంవత్సరం సంగారెడ్డి జిల్లాలో 3.60లక్షల ఎకరాల్లో పత్తి సాగు లక్ష్యం.
* వచ్చే సంవత్సరం పత్తికి మంచి డిమాండ్ ఉంటుంది.
* సంగారెడ్డి జిల్లాలో వానకాలంలో 25వేల ఎకరాల్లో మక్కలు సాగు చేస్తున్నారు. రైతులు దీనికి ప్రత్యామ్నాయం
ఆలోచించాలి.
* కందుల ఉత్పత్తి ఎంత వచ్చినా.. మద్దతు ధరకు ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది.
* ఒకే పంట వేస్తే క్రమంగా భూమిలో సారం తగ్గుతుంది. అందుకే పంటలు మార్చాలి.
*జిల్లా అవసరాలకు అనుగుణంగా ఎరువులు తెప్పించాం.
* రైతులు ఎరువులు తక్కువగా వినియోగించాలి.
* రైతు బంధు వేదికల నిర్మాణం కోసం ప్రభుత్వం 20లక్షల రూపాయలు కేటాయించింది.
* నాలుగు నెలల్లో నిర్మాణాం పూర్తి చెయ్యాలి

* రైతు బంధు వేదికల నిర్మాణం కోసం దాతలు ముందుకు వచ్చేలా ప్రోత్సహించాలి.
* కొత్త వ్యవసాయ విధానంపై గ్రామ స్థాయిలో రైతులకు అవగాహన కల్పించేలా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకోవాలి.
* ఒకరికొకరు పోటీ పడి నూతన వ్యవసాయ విధానం ముందుకు తీసుకుపోవాలి.
* సంగారెడ్డి జిల్లాలో 20503 మంది రైతులకు ఒకే దఫలో రుణ మాఫీ జరిగింది.
* మిగిలిన రైతులకు దశల వారీగా

tags : harishrao

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info