A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
బాబు టైమ్ లో వంద టిటిడి ఆస్తులు అమ్మారు
Share |
July 14 2020, 10:19 pm

ప్రస్తుత ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే 100 ప్రాంతాల్లో టీటీడీ ఆస్తులు విక్రయించారని చంద్రగిరి ఎమ్మెల్యే ,ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కరరెడ్డి చెప్పారు. తమ ప్రభుత్వం శ్రీవెంకటేశ్వరుడి పట్ల అత్యంత భక్తి ప్రపత్తులతో వ్యవహరిస్తోందని, దేవుడి ఆస్తులు,దేవుడికే దక్కేలా కృషి చేస్తోందని ఆయన అన్నారు. రూ.6కోట్ల విలువైన ఆస్తులను చంద్రబాబు హయాంలో వేలం వేశారని చెవిరెడ్డి తెలిపారు.
‘టీటీడీకి ప్రత్యేకమైన యాక్ట్ ఉంది. 1990లోనే దేవస్థాన భూముల అమ్మకం, లీజులు ఇచ్చేందుకు టీటీడీకి హక్కు కల్పించారు. చంద్రబాబు అధికారంలో ఉండగా అప్పటి టీటీడీ ఛైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి ఆధ్వర్యంలో నిర్ణయం జరిగింది. ఆ పాలకమండలిలో బీజేపీ నేత భానుప్రకాష్‌ రెడ్డి ముఖ్య సభ్యుడు. ఈనాడు స్థంస్థల అధినేత రామోజీరావు బంధువు సుచరిత కూడా బోర్డు సభ్యురాలే. ఓ టీడీపీ ఎమ్మెల్యే కూడా అప్పటి కమిటీలో సభ్యుడుగా ఉన్నారు. వాళ్లందరూ ఆమోదించిన తర్వాతే ఈ ఆస్తులు వేలానికి వచ్చాయి.
2015 జులైలో నిరర్థక ఆస్తుల గుర్తింపునకు కమిటీ ఏర్పాటు చేశారు. 2016 జనవరిలో కమిటీ నివేదిక మేరకు ఆస్తుల విక్రయానికి అప్పటి బోర్డు అంగీకరించింది. అని ఆయన అన్నారు. వేల కోట్ల విలువైన సదావర్తి భూములను 50 కోట్లకు అమ్మాలనుకుంది చంద్రబాబు కాదా?. మానస ట్రస్ట్ భూములను ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టింది చంద్రబాబు కాదా?. టీటీడీ ఆస్తులను అమ్మితే టీటీడీ కార్పస్ ఫండ్‌కు జమ అవుతుంది ప్రభుత్వానికి కాదు. భగవంతుడిని రాజకీయాల్లోకి లాగడం సరైందికాదు’ అని చెవిరెడ్డి అన్నారు

tags : chevireddy

Latest News
*మరోసారి టి.సర్కార్ పై హైకోర్టు ఆగ్రహం
*చంద్రాబు భలే లింక్ పెట్టారు
*తెలంగాణలో కరోనా నుంచి 99 శాతం రికవరి
*ఎపి కరోనా రిపోర్టు
*కరోనాపై కెటిఆర్ గడుసు వ్యాఖ్యలు
*కరోనా పై కొత్త విషయం చెబుతా-ట్రంప్
*కెసిఆర్ ప్రభుత్వ ఆస్పత్రులను సందర్శించరా
*ప్రగతి భవన్ ను కరోనా వైద్య కేంద్రం చేయాలి
*విశాఖకు మహర్దశ
*గ్రామ సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ లు
*చంద్రబాబు విద్యలు తెలిసిపోయాయి
*బుట్టాయగూడెంలో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి
*విశ్వాసం ప్రకటించిన ఈటెల
*బెంగుళూరు లాక్ డౌన్ -నిపుణుల సూచన
*మళ్లీ వ్యవసాయానికి గిరాకీ
*యనమల లెక్కలు అన్నీ అబద్దాలే
*చంద్రబాబుకు సంచయిత గజపతి కౌంటర్
*కరోనా పరీక్షల రిజల్ట్స్- ఎపి ఆదేశాలు
*మా పేర్లతో ఫేక్ ట్వీట్లు-లోకేష్
*రాజస్తాన్ రాజకీయం పాకాన పడింది
*రాజస్తాన్ లో కొలిక్కి రాని రాజకీయ సంక్షోభం
*వైసిపి పై ఎన్ని కుట్రలో..తాజాగా
*హైదరాబాద్ లో 8 హైరిస్కు జోన్ లు
*తెలంగాణ కరోనా రిపోర్టు
*ఎపిలో మళ్లీ రెడ్ జోన్ మండలాలు
*బాలకృష్ణ విజ్ఞప్తి
*చంద్రబాబు అబద్దాల ప్యాక్టరీకి యనమల
*కాంట్రాక్ట్ ఉద్యోగుల సమీక్ష-వెయ్యి కోట్ల భారం
*VISION + ACTION = YS JAGAN
*టి.ప్రభుత్వానికి సుజాతారావు సలహా
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info