A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
విజయనగరంలో మరో సెంటిమెంట్ రాజకీయం
Share |
July 14 2020, 9:15 pm

ఎపిలో ప్రతి చిన్న విషయం రాజకీయంగా మారుతోంది. ప్రతిపక్ష టిడిపి ఏదో ఒక విధంగా వక్రీకరించి ప్రభుత్వంపై బురద చల్లే యత్నం చేస్తున్నట్లుగా ఉంది. విజయనగరంలో మూడులాంతర్లు ఒక గుర్తుగా ఉన్నాయట.వాటిని అక్కడ తొలగించి అబివృద్ది పనులు చేసి తిరిగి వాటిని పునరుద్దరించాలని విజయనగరం మున్సిపాల్టీ తలపెట్టింది. వెంటనే కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు విమర్శలకు దిగారు. చారిత్రక చిహ్నాలు తొలగిస్తారా అంటూ ప్రచారం చేశారు. దీనిపై ఆయన అన్న కుమార్తె, సింహాచలం ట్రస్టుబోర్డు చైర్ పర్సన్ సంచయిత కౌంటర్ ఇచ్చారు. ‘విజయనగరంలో మూడు లాంతర్ల స్తంభంపై చంద్రబాబు నాయుడు, మా బాబాయ్‌ అశోక్‌గజతి గారు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. నిజం ఏంటంటే.. ప్రస్తుతం అక్కడ పునరుద్ధరణ పనులు జరుగుతున్నాయి. అవి పూర్తయ్యాక మూడు లాంతర్ల స్తంభాన్ని తిరిగి ప్రతిష్టిస్తారు. విజయనగరం చరిత్ర, సంస్కృతికి ప్రతీక, 1869 నాటి మోతీమహల్‌ను పునరుద్ధరించకుండా, మాన్సాస్‌ ఛైర్మన్‌గా ఉండగా బాబాయ్‌ అశోక్‌గజపతిగారు ఎందుకు ధ్వంసంచేశారు. తాతగారైన పీవీజీ రాజుగారి వారసత్వాన్ని ఎందుకు కాపాడలేకపోయారు?. దీనిపై చంద్రబాబు వివరణ ఇవ్వగలరా? ’ అని ఆమె ట్వీట్‌ చేశారు.

మూడు లాంతర్లతో పాటు ఆశోకచక్రంతో కూడిన జాతీయ చిహ్నం, మూడు సింహాలను కార్పొరేషన్‌ కార్యాలయంలో భద్రపరిచారు. కలెక్టర్‌ హరిజవహర్‌లాల్‌ ఆదేశాల మేరకు నగర అభివృద్ధి పనుల్లో భాగంగా వాటిని తొలగించామని, మూడు లాంతర్ల స్థానంలో నూతన నిర్మాణం చేపడతామని నగరపాలక సంస్థ కమిషనర్‌ ఎస్‌ఎస్‌ వర్మ తెలిపారు. ఇప్పటి వరకూ ఉన్న నాలుగు సింహాల బొమ్మతో పాటు నూతన లాంతర్లను ఏర్పాటు చేసే దిశగా పలు నమూనాలను సిద్ధం చేశామన్నారు. రానున్న 15 రోజుల్లో కొత్త కట్టడం పూర్తిచేస్తామని తెలిపారు.

అంత సనీయిర్ నేత అయిన అశోక్ గజపతి రాజు కూడా ఇలాంటి దిక్కుమాలిన అబద్దపు ప్రచారాలకు దిగాలా?

tags : vijayaanagaram, sentiment

Latest News
*మరోసారి టి.సర్కార్ పై హైకోర్టు ఆగ్రహం
*చంద్రాబు భలే లింక్ పెట్టారు
*తెలంగాణలో కరోనా నుంచి 99 శాతం రికవరి
*ఎపి కరోనా రిపోర్టు
*కరోనాపై కెటిఆర్ గడుసు వ్యాఖ్యలు
*కరోనా పై కొత్త విషయం చెబుతా-ట్రంప్
*కెసిఆర్ ప్రభుత్వ ఆస్పత్రులను సందర్శించరా
*ప్రగతి భవన్ ను కరోనా వైద్య కేంద్రం చేయాలి
*విశాఖకు మహర్దశ
*గ్రామ సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ లు
*చంద్రబాబు విద్యలు తెలిసిపోయాయి
*బుట్టాయగూడెంలో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి
*విశ్వాసం ప్రకటించిన ఈటెల
*బెంగుళూరు లాక్ డౌన్ -నిపుణుల సూచన
*మళ్లీ వ్యవసాయానికి గిరాకీ
*యనమల లెక్కలు అన్నీ అబద్దాలే
*చంద్రబాబుకు సంచయిత గజపతి కౌంటర్
*కరోనా పరీక్షల రిజల్ట్స్- ఎపి ఆదేశాలు
*మా పేర్లతో ఫేక్ ట్వీట్లు-లోకేష్
*రాజస్తాన్ రాజకీయం పాకాన పడింది
*రాజస్తాన్ లో కొలిక్కి రాని రాజకీయ సంక్షోభం
*వైసిపి పై ఎన్ని కుట్రలో..తాజాగా
*హైదరాబాద్ లో 8 హైరిస్కు జోన్ లు
*తెలంగాణ కరోనా రిపోర్టు
*ఎపిలో మళ్లీ రెడ్ జోన్ మండలాలు
*బాలకృష్ణ విజ్ఞప్తి
*చంద్రబాబు అబద్దాల ప్యాక్టరీకి యనమల
*కాంట్రాక్ట్ ఉద్యోగుల సమీక్ష-వెయ్యి కోట్ల భారం
*VISION + ACTION = YS JAGAN
*టి.ప్రభుత్వానికి సుజాతారావు సలహా
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info