A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఒన్ మాన్ ఆర్మి,ఒన్ మాన్ వండర్ అన్న పోసాని
Share |
May 27 2020, 2:28 am

ఎపి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వన్‌మ్యాన్‌ ఆర్మీ అని , వన్ మాన్ వండర్ అని ప్రముఖ నటుడు పోసాని కృష్ణ మురళీ అన్నారు. జగన్ అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే దాదాపు అన్ని హామీలను అమలు చేశారని ఆయన చెప్పారు. కరోనా సమయంలో కూడా సంక్షేమ పథకాలు అమలు చేసిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. దేశంలో ఆంధ్రప్రదేశ్‌లా ఏ రాష్ట్రం కూడా ఇలా చేయలేదన్నారు. విశాఖ గ్యాస్‌ ప్రమాద మృతుల కుటుంబాలకు రూ.కోటి చొప్పున పరిహారం ఇచ్చారని.. దేశంలో కోటి రూపాయల పరిహారం ఇచ్చిన దాఖలాలు లేవని చెప్పారు.చంద్రబాబు హయాంలో పుష్కరాల మృతులకు ఇచ్చింది రూ.10 లక్షలేనని, విశాఖ గ్యాస్ ఘటనకు ప్రభుత్వానికి సంబంధం లేకపోయినా.. మృతుల కుటుంబాలకు రూ.కోటి చొప్పున పరిహారం ఇచ్చారని పేర్కొన్నారు. సీఎం వైఎస్‌ జగన్ సంక్షేమ పథకాలన్నీ చాలా బాగున్నాయన్నారు. ఇళ్లకు వెళ్లి పెన్షన్లను ఇవ్వడం దేశంలో ఎక్కడా లేదన్నారు. చంద్రబాబు, సోనియా, అహ్మద్ పటేల్, చిదంబరం కలిసి కుట్రలు చేసి జగన్‌ను అన్యాయంగా జైల్లో పెట్టించారని పోసాని మురళీకృష్ణ పేర్కొన్నారు.వచ్చే నాలుగేళ్లలో మరిన్ని కార్యక్రమాలు జగన్ చేపడతారని ఆయన అన్నారు. వచ్చేసారి తాము కోరకుండానే జగన్ ను ప్రజలు ఎన్నుకుంటారని కృష్ణమురళీ అన్నారు.

tags : posani

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info