A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
పాలన ఎలా ఉండాలో జగన్ చేసి చూపారు
Share |
September 22 2020, 9:24 am

వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఇచ్చిన హామీలను అమలు చేసి చూపించామని , ఆ ఘనత ముఖ్యమంత్రి జగన్ దేనని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. పాలన ఎలా సాగాలో వైఎస్‌ జగన్‌ చేసి చూపించారు. కార్పొరేట్‌ వైద్యానికి ధీటుగా ప్రభుత్వ వైద్యాన్ని అభివృద్ధి చేశాం. మానవీయ కోణంలో పథకాలను సీఎం జగన్ ప్రవేశ పెట్టారు. ఇచ్చిన హామీలనే కాకుండా ఇవ్వని హామీలను కూడా సీఎం జగన్ అమలు చేశారు. విద్య వైద్య రంగానికి పెద్ద పీట వేశారు. కార్పొరేట్ వ్యవస్థకు దీటుగా విద్య వైద్య రంగాన్ని సీఎం జగన్ రూపొందిస్తున్నారు. పేదల పిల్లల కోసం ఇంగ్లీషు మీడియం విద్యను తీసుకొచ్చారు. పేదలకు ఇళ్ళు స్థలాలు ఇస్తున్నారు. టీడీపీ హయాంలో టీడీపీ వాళ్ళకే పథకాలు అందేవి. సీఎం జగన్‌ పాలనలో అర్హులైన వారందరికీ పథకాలు అందుతున్నాయి. పాలన ఎలా ఉండాలో జగన్‌మోహన్‌రెడ్డి చూపించారు. ఎల్జీ పాలిమర్స్ విషయంలో బాధితులను ముఖ్యమంత్రి పెద్ద మనసుతో ఆదుకున్నారు.’ అని ఆయన అన్నారు.

tags : sajjala

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info