A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
మళ్లీ గ్రేటర్ రాయలసీమ నేతలులైన్ లోకి..
Share |
September 22 2020, 10:31 am

గ్రేటర్ రాయలసీమ ప్రాంత నేతలు మళ్లీ లైన్ లోకి వచ్చారు. ఎపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు వారు లేఖ రాశారు. గోదావరి జలాలలను ఎత్తిపోత ద్వారా కృష్ణా డెల్టాకు మళ్లించి, అక్కడ మిగిలే నీటిని రాయలసీమకు కేటాయించాలని వారు కోరారు.

మాజీ ఎమ్.పిలు ఎంవీ మైసూరారెడ్డి, గంగుల ప్రతాప్ రెడ్డి, ఉమ్మడి ఏపీ మాజీ డీజీపీలు దినేశ్ రెడ్డి, ఆంజనేయరెడ్డితో పాటు 16 మంది గ్రేటర్ రాయలసీమ నేతలు లేఖ రాశారు.రాయలసీమకు గోదావరి జలాలు తీసుకు వెళ్లవచ్చన్న తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రకటనను వారు స్వాగతించారు. దీనిపై జగన్ చొరవ తీసుకుని రాయలసీమ ప్రాజెక్టులైన హంద్రీనావా, గాలేరు-నగరి, వెలుగొండ ప్రాజెక్టులకు నీటి కేటాయింపులు చేస్తూ చట్టబద్ధత కల్పించాలన్నారు.తెలుగు గంగకు 25 టీఎంసీల నీటిని మాత్రమే కేటాయించారని, హంద్రీనీవా, గాలేరు-నగరి, వెలుగొండ ప్రాజెక్టులకు చుక్కనీరు కూడా కేటాయించలేదన్నారు. ఆ తీర్పు అమల్లోకి వస్తే ఈ ప్రాజెక్టులన్నీ నిరర్థక ఆస్తులుగా మిగిలిపోతాయన్నారు. ఎపి ముందున్న ప్రత్యా్మ్నాయం గోదావరి జలాలు మళ్లించడమేనన్నారు. పట్టిసీమ, చింతలపూడి ప్రాజెక్టుల ద్వారా ఆదా అయిన నీటిని గ్రేటర్ రాయలసీమ ప్రాజెక్టులకు కేటాయించి చట్టబద్ధత కల్పించడం తప్ప మరో దారి లేదని వారు పేర్కొన్నారు.

tags : greater rayalaseema

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info