A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఏడాదిలోనే మానిఫెస్టోని అమలు చేసి చూపారు
Share |
September 22 2020, 9:28 am

రాష్ట్ర చరిత్రలో మే ఇరవై మూడో తేదీ మరచిపోలేని రోజు అని ఎమ్మెల్సీ మహ్మద్ ఇక్బాల్ అన్నారు. విజయోత్సవ రోజు సందర్భంగా వైఎస్ ఆర్ కాంగ్రసె్ కార్యాలయంలో వేడుకలు జరిగాయి. . పరిగి బస్టాండ్‌లోని దివంగత నేత వైఎస్‌ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి ఎమ్మెల్సీ మహమ్మద్ ఇక్బాల్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎమ్మెల్సీ మహమ్మద్ ఇక్బాల్ మాట్లాడుతూ..' మే 23 చరిత్రలో మరిచిపోలేని రోజు అని ఇక్బాల్‌ పేర్కొన్నారు. ఏడాదిలోనే మేనిఫెస్టోను అమలు చేసిన ఏకైక సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి'. ఇలాంటి ముఖ్యమంత్రి మా రాష్ట్రాల్లో లేరని ఇతర రాష్ట్రాల ప్రజలు మాట్లాడటంతోనే ఆయన విజన్ ఉన్న ముఖ్యమంత్రి అని తేలిపోయిందని పేర్కొన్నారు. జననేత సుపరిపాలన చూసి చంద్రబాబుకు నిద్రపట్టడం లేదని ఎద్దేవా చేశారు.

tags : ikbal

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info