A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ద బెస్ట్ సి.ఎమ్ గా ప్రశంసలందుకున్నారు
Share |
May 27 2020, 2:31 am

రాష్ట్ర చరిత్రలో అత్యధిక ఓట్ల షేర్‌ పొంది తిరుగులేని జననేతగా ముఖ్యమంత్రి జగన్‌ ప్రజల ఆశీర్వాదం పొంది ఏడాది పూర్తయిందని , ఈ ఏడాది కాలంలో ఇచ్చిన హామీలను జగన్‌ అమలు చేశారని వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు చెప్పారు. జగన్ పదవీబాద్యతలు చేపట్టి ఏడాది అవుతున్న సందర్భంగా మే ముప్పైన రైతు భరోసా కేంద్రాలను ప్రారంభిస్తున్నామని ఆయన తెలిపారు. ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పోలిస్తే ది బెస్ట్‌ సీఎంగా దేశం మొత్తం కొనియాడుతుందని తెలిపారు. ఎన్నికల ప్రచారం సందర్భంగా ' నేను ఉన్నాను.. నేను విన్నాను' అని జగన్‌ ప్రజలకు మాట ఇస్తే .. ఆయన ఏం చేయగలడంటూ టీడీపీ విమర్శలకు దిగిందన్నారు. కానీ కరోనా వంటి కష్టకాలంలో కూడా ఏ ఒక్క సంక్షేమ పథకాన్ని ఆపకుండా అమలు చేయడం జగన్‌కే చెల్లిందన్నారు. ఏడాది కాలంలో ప్రజలకు మేమిచ్చిన మాటను నిలబెట్టుకున్నామని కన్నబాబు చెప్పారు.

అమ్మ ఒడి.. రైతు భరోసా వంటి పథకాల విషయంలో జగన్‌ తన ధర్మాన్ని తూ.చ తప్పకుండా అమలు చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో వ్యవసాయ పరంగా రికార్డు సృష్టిస్తున్నామన్నారు. తొలిసారిగా టమాట, పెండ్లం,మిర్చి ఇలా పలు పంటలను మార్కెటింగ్ శాఖ ద్వార కొనుగోలు చేసి బజార్లకు పంపించినట్లు చెప్పారు.

tags : kannababu

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info