A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
కరోనా బయం పోయినా..జాగ్రత్తగా ఉండాలి-ఈటెల
Share |
May 26 2020, 3:05 pm

కరోనా వైరస్ పై భయంతొలగి పోయినా, ఎవరి మట్టుకు వారు జాగ్రత్తలు పాటించాలని ప్రజలకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖా మంత్రి ఈటెల రాజేందర్ సూచించారు.మల్లాపూర్ డివిజన్ ఎస్ వి నగర్లో ఏర్పాటు చేసిన బస్తీ దవాఖాన ను మేయర్ బొంతు రామ్మోహన్, ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్బంగా మంత్రి
మాట్లాడుతూ  వివిధ రాష్టాలకు పనులకై వెళ్లి, ప్రభుత్వం కల్పిస్తున్న వెసులుబాటుతో తిరిగి మన రాష్టానికి వచ్చిన వారితో
అనేక మందికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు వివరించారు.దేశంలో  లాక్ డౌన్ ను పటిష్టంగా అమలు చేసిన రాష్ట్రం తెలంగాణ
యే నని పేర్కొన్నారు. హైదరాబాద్ నగరాన్ని వైరస్ భారి నుండి కాపాడుకున్నాము. ముంబై, ధానే, పూనా నగరాలలో
నెలకొన్న పరిస్థితులను అర్ధం చేసుకోండి.. ప్రతి ఒక్కరూ భౌతిక దూరం పాటించాలి... మాకేమి అవుతుందులే అనే నిర్లక్ష్యం
వద్దు... మీ కుటుంబం, మీతోటి వారు, సమాజం గురించి ఆలోచించండి అని చెప్పారు. బస్తీ దవాఖానలలో పైసా ఖర్చు
లేకుండా వైద్య సేవలు అందుతాయని తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని సేవలను పెంచనున్నట్లు తెలిపారు. ఉదయం 9
నుండి సాయంత్రం 4 గంటల వరకు బస్తీ దవాఖానలు తెరిచి వుంటాయని తెలిపారు.కార్పొరేటర్లు, కాలనీ వాసులు  బస్తీ
దవాఖానాల నిర్వహణలో భాగస్వాములు కావాలని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో జోనల్ కమీషనర్ ఉపేందర్ రెడ్డి,
స్థానిక కార్పొరేటర్లు, తదితరులు పాల్గొన్నారు.

tags : eetela

Latest News
*చంద్రబాబుపైనే కాదు..ఈనాడు, ఎబిఎన్ పై పోరు..జగన్
*లాక్ డౌన్ అమలులో కేంద్రం విఫలం-రాహుల్
*8148 పరీక్షలు-48 పాజిటివ్
*ఎపిలో కూడా విమాన సర్వీసులు మొదలు
*2.40లక్షల తిరుమల లడ్డూల విక్రయం
*630 విమాన సర్వీసులు రద్దు అయ్యాయి
*నరసాపురం ప్రాంతంలో మెడికల్ కాలేజీ
*ఐవైఆర్ కృష్ణారావు 2 రకాలుగా మాట్లాడారా
*ఇంతకాలం ఇంద్రభవనంలో ఉండి వచ్చారు
*ఉదయగిరి నీటి సమస్యపై వెంకయ్య దృష్టి
*ఏజెన్సిలో కాళ్ల వాపుపై సి.ఎమ్ ఆదేశాలు
*సి.ఎమ్. సందేశం 5 నిమిషాల్లోనే ప్రజల చెంతకు
*ఎపి పాలనలో హుందాతనం,బాద్యతాయుతం
*టిడిపి కి మరో షాక్-మరో ఎమ్మెల్యే గుడ్ బై
*ఎపిలో బిజెపి విద్వేషపూరిత రాజకీయం
*చంద్రబాబు నోటికి ఏది వస్తే అది మాట్లాడి..
*కేంద్ర మంత్రి క్వారంటైన్ కు వెళ్లక్కర్లేదా
*రియల్ ఎస్టేట్ ను కరోనా ముంచేసింది
*లాక్ డౌన్ సొడిగిస్తే ఆర్ధిక వినాశనమే
*టిడిపి స్కీములను రద్దు చేయడం వైఫల్యమా
*క్షీనించిన అడవుల పునరుద్దరణ యత్నాలు
*కొత్త పాలనకు జగన్ శ్రీకారం చుట్టారు
*ఎపిలో లాయర్ల సంక్షేమానికి 100 కోట్ల నిధి
*పాదాయాత్రలో వచ్చిన ఆలోచనలే ఇవన్ని
*లక్జరీ నౌక-గదుల్లోనే 200 మంది భారతీయులు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info