A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
టిడిపి ఎసి దీక్షలను ప్రజలు గమనిస్తున్నారు
Share |
September 22 2020, 10:00 am

టీడీపీ దొంగ దీక్షలను ప్రజలు గమనిస్తున్నారని విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. టీడీపీకి పార్టీ ప్రయోజనాలు తప్ప ప్రజా ప్రయోజనాలు పట్టవని, అసలు విద్యుత్ చార్జీలు పెంచకపోయినా, నానా యాగీ చేస్తున్నారని ఆయన అన్నారు. ఐదేళ్ల పాలనలో మూడుసార్లు విద్యుత్ చార్జీలు పెంచిన ఘనత టీడీపీది. కరోనా కష్టకాలంలో పారిపోయి ఇప్పుడు ఇళ్లలో ఏసీ గదుల్లో కూర్చుని ధర్నాలు చేయటం సిగ్గుచేటు.రాష్ట్ర ప్రజలని గందరగోళానికి గురిచేసేందుకు టీడీపీ ప్రయత్నిస్తోంది. పార్టీ మనుగడ కాపాడుకొనేందుకు నీచరాజకీయాలు చేస్తోంది. రైతులకు తొమ్మిది గంటల పగలు కరెంట్ ఇచ్చిన వ్యక్తి వైఎస్ జగన్.మీ పార్టీకి చెందిన జేసీ దివాకర్ రెడ్డే మీ దీక్షలు దొంగ దీక్షలన్నారు. టీడీపీ నేతలు ఎల్లోమీడియా సహకారంతో దుష్ప్రచారం చేస్తున్నారు అని ఆయన మండిపడ్డారు.

tags : vishnu

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info