A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
తుపాను పై గవర్నర్ వ్యాఖ్య-తీవ్ర విమర్శలు
Share |
September 22 2020, 10:21 am

పశ్చిమబెంగాల్ గవర్నర్ జగదీప్ ధంకర్ తుపానుపై చేసిన వ్యాఖ్య తీవ్ర విమర్శలకు దారి తీసింది. దాంతో ఆయన యుటర్న్ తీసుకోవలసి వచ్చింది. రాజ్ భవన్ లో చాలా గదులు ఖాళీగా ఉన్నాయని,వాటిని తుపాను బాదితులకు తాత్కాలిక వసతిగా మార్చాలని కొందరు డిమాండ్ చేశారు. బెంగాల్ లో పెను తుపాను భీభత్సం సృష్టించిన సంగతి తెలిసిందే. తుపాను తీరం దాటిన తర్వాత గవర్నర్ తుపాను వల్ల కలిగిన నష్టం తక్కువే (మినిమమ్ ) అంటూ వ్యాఖ్యానించారు.దానిపై నెటిజన్లు,అదికార టి.ఎమ్.సి నేతలు మండిపడ్డారు.దాంతో ఆ తర్వాత ఆయన యుటర్న్ తీసుకుని తుపాను వల్ల తీవ్ర నష్టం జరిగిందని, అదికార యంత్రాంగం తీవ్ర కృషి చేసి దానిని తగ్గించడానికి కృషి చేసిందని, అయినా నష్టం అపారంగా ఉందని వ్యాఖ్యానించించి. ఈ వ్యాఖ్యల తీరుపై కొందరు ఆయనను తీవ్రంగా దుయ్యబట్టారు.అసలు ఈ గవర్నర్ వచ్చాకే బెంగాల్ కు కరోనా,తుపాను వంటివి వస్తున్నాయని ఆక్షేపించారు.రాజ్ భవన్ ను తుపాను షెల్టర్ గా మార్చాలని మరికొందరు ట్రోల్ చేశారు.

tags : governor

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info