A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
జయలలిత ఇల్లు ప్రభుత్వపరం
Share |
September 22 2020, 10:28 am

తమిళనాడులో దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత హయాంలో మీడియాపై పెట్టిన పలు డిఫమేషన్ క్రిమినల్ కేసులను మద్రాస్ హైకోర్టు కొట్టివేసింది. మీడియాకు సంబందించిన పలువురు వేసిన క్వాష్ సిటిషన్ లను కోర్టు అనుమతించింది. ఈ సందర్భంగా జడ్జి అబ్దుల్ ఖుద్దూస్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.ఒక వ్యక్తి లేదా, ఒక పబ్లిక్ సర్వంట్, లేదా రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తి ఎవరైనా అసహనానికి గురి కావచ్చని, కాని స్టేట్ అంటే రాష్ట్ర ప్రభుత్వంగా అసహనానికి గురి కాకూడదని వ్యాఖ్యానించారు. స్టేడ్ అన్నది ఒక తండ్రి వంటి దని,పిల్లలు ఏవైనా తప్పు చేసినా సంయమనం పాటించాలని అభిప్రాయపడ్డారు.కేవలం అతి అరుదైన సందర్భాలలో మాత్రమే స్టేట్ పరంగా కేసులు పెట్టాలని ఆయన అన్నారు.సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఇలాగే కేసులు పెట్టుకుంటే పోతే కింద కోర్టులకు ఇదే సరిపోతుందని ఆయన అన్నారు. మొత్తం 226డిఫమేషన్ కేసులు 2010 నుంచి ఆనాటి జయలలిత ప్రభుత్వం హయాంలో పడ్డాయి. అదే సమయంలో మీడియాను కూడా ఆయన హెచ్చరించారు. మీడియా బాద్యతాయుతంగా మెలగాలని, లేకుంటే ప్రజాస్వామ్యానికి విఘాతం కలుగుతుందని ఆయన అన్నారు.

tags : jayalalita

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info