A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
రైతును రాజు చేయడమే లక్ష్యం
Share |
May 26 2020, 3:11 pm

పటాన్ చెరు మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారోత్సవంలో రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు,
హాజరైన ఆర్థిక మంత్రి హరీష్ రావు గారు, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి గారు*

రైతు బతికితే రాజ్యం బతుకుతుంది

- ఒక్క రైతు వ్యవసాయం చేస్తే దాని చుట్టూ ఆధారపడిన వందమంది బతుకుతారు
- అందుకే రైతును రాజును చేయాలన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్  గారు పనిచేస్తున్నారు
- గత ప్రభుత్వాల హయాంలో వానాకాలంలో చెరువులలో బర్లకు, గొర్లకు నీళ్లు లేని దుస్థితి
- ఇప్పుడు మండు వేసవిలో చెరువులు అలుగులు పారుతున్నాయి
- విపక్షాలు చెబితే కేసీఆర్ గారు నీళ్లు ఇయ్యలే, కరంటు సరఫరా చేయలే, రైతుబంధు, రైతుభీమా పథకాలు పెట్టలే
- విపక్షాల గుడ్డి వ్యతిరేకతను పట్టించుకోవాల్సిన అవసరం లేదు

- నగరం చుట్టూ నాలుగు పెద్ద మార్కెట్లు.. అవకాశాన్ని బట్టి ఔటర్ కు బయట .. ఔటర్ కు లోపల
- ఆరేళ్లక్రితం తిండిగింజల కోసం తండ్లాడిన తెలంగాణ ఇప్పుడు పండిన పంటలను దాచుకునేందుకు స్థలాలు వెతికే పరిస్థితి
ఏర్పడింది
- వ్యవసాయానికి ఊతం ఇచ్చేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అనేక పథకాలు ప్రవేశపెట్టారు

- కాళేశ్వరం మూడో దశ, పాలమూరు రంగారెడ్డి పూర్తయితే పండే పంటలను ఎక్కడ దాచిపెట్టాలి
- ఈసారి యాసంగిలోనే 39.40 లక్షల ఎకరాలలో వరి సాగయ్యింది
- కరోనా విపత్తు నేపథ్యంలో రైతుల పంటల కొనుగోలుకు అనుమతించిన ఏకైక రాష్ట్రం తెలంగాణ
- కేసీఆర్ గారి ఆలోచనను చూసి కేంద్రం దేశంలోని అన్ని రాష్ట్రాలలో పంటల కొనుగోళ్లలో మినహాయింపు ఇచ్చింది
- పంటలు దాచుకునేందుకు మరో 40 లక్షల మెట్రిక్ టన్నుల గోదాముల నిర్మాణం
- ప్రజల అవసరాలను అధ్యయనం చేసిన నివేదిక ప్రకారం నియంత్రిత పంటల సాగుకు ప్రభుత్వ చర్యలు
- రైతులకు దిగుబడితో పాటు ఆదాయం పెరగాలన్నది ప్రభుత్వ ఉద్దేశం

- కోహెడలో 170 ఎకరాల మార్కెట్ లో పండ్లు, కూరగాయలతో పాటు ఇతర సరుకులు
- ప్రజల అవసరాలను గమనించి సమీకృత మార్కెట్ల ఏర్పాట్లను యోచిస్తుంది
- మార్కెటింగ్ వ్యవస్థలో నూతన ఆవిష్కరణలు రావాలి
- మారుతున్న పరిస్థితులను రైతాంగం, ట్రేడర్లు, మార్కెటింగ్ శాఖ అధికారులు గుర్తించాలి
- నియంత్రిత మార్కెట్ వ్యవస్థ మేరకు గతంలో మార్కెటింగ్ చట్టాలు
- సాంప్రదాయ మార్కెటింగ్ కొనసాగుతున్నా వ్వవస్థలోనూతన ఆవిష్కరణలపై మన అధ్యయనం ఉండాలి
- కరోనా విపత్తు మనకు కొత్తపాఠాలు నేర్పుతుంది
- రేపు ప్రపంచ మార్కెట్ ఎటువైపు అడుగులు వేస్తుందో తెలియని పరిస్థితి
- ఆన్ లైన్ లో ఆర్డరిస్తే ఇంటిదగ్గరకే పండ్లు, కూరగాయలు నిత్యావసర వస్తువులు వస్తున్నాయి

- ఆన్ లైన్ మార్కెట్ వ్యవస్థపై మార్కెటింగ్ శాఖ కసరత్తు చేయాలి
- గజ్వేల్, సిద్దిపేట మార్కెట్లను ప్రజాప్రతినిధులు అధ్యయనం చేయాలి
- మహానగర అవసరాలు తీర్చేందుకు పటాన్ చెరు మార్కెట్  ఉపయోగపడాలి
- 14 ఎకరాల మార్కెట్ నిర్మాణం అనేది అద్భుతం .. ఇది ఈ ప్రాంతానికి పెద్ద కానుక
- పటాన్ చెరు మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారోత్సవంలో రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు,
హాజరైన ఆర్థిక మంత్రి హరీష్ రావు గారు, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి గారు, ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి గారు తదితరులు
*ఆర్థికమంత్రి హరీష్ రావు గారి వ్యాఖ్యలు*

- పదవులు రావడం గొప్ప కాదు .. ప్రజలకు సేవ చేయడం గొప్ప
- రైతు బాగుపడాలి .. వ్యవసాయం లాభసాటి కావాలన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నూతన వ్యవసాయ
విధానం తెస్తున్నారు
- వారి ఆశాయాలు, లక్ష్యాలకు అనుగుణంగా మనం పనిచేయాలి
- మారుమూల నారాయణఖేడ్ లో మార్కెట్ పెట్టిన ఘనత టీఆర్ఎస్ దే
- నూతన చైర్మన్లు, సభ్యులకు అభినందనలు
- ప్రభుత్వం నుండి సంపూర్ణ సహకారం ఉంటుంది

tags : harishrao

Latest News
*చంద్రబాబుపైనే కాదు..ఈనాడు, ఎబిఎన్ పై పోరు..జగన్
*లాక్ డౌన్ అమలులో కేంద్రం విఫలం-రాహుల్
*8148 పరీక్షలు-48 పాజిటివ్
*ఎపిలో కూడా విమాన సర్వీసులు మొదలు
*2.40లక్షల తిరుమల లడ్డూల విక్రయం
*630 విమాన సర్వీసులు రద్దు అయ్యాయి
*నరసాపురం ప్రాంతంలో మెడికల్ కాలేజీ
*ఐవైఆర్ కృష్ణారావు 2 రకాలుగా మాట్లాడారా
*ఇంతకాలం ఇంద్రభవనంలో ఉండి వచ్చారు
*ఉదయగిరి నీటి సమస్యపై వెంకయ్య దృష్టి
*ఏజెన్సిలో కాళ్ల వాపుపై సి.ఎమ్ ఆదేశాలు
*సి.ఎమ్. సందేశం 5 నిమిషాల్లోనే ప్రజల చెంతకు
*ఎపి పాలనలో హుందాతనం,బాద్యతాయుతం
*టిడిపి కి మరో షాక్-మరో ఎమ్మెల్యే గుడ్ బై
*ఎపిలో బిజెపి విద్వేషపూరిత రాజకీయం
*చంద్రబాబు నోటికి ఏది వస్తే అది మాట్లాడి..
*కేంద్ర మంత్రి క్వారంటైన్ కు వెళ్లక్కర్లేదా
*రియల్ ఎస్టేట్ ను కరోనా ముంచేసింది
*లాక్ డౌన్ సొడిగిస్తే ఆర్ధిక వినాశనమే
*టిడిపి స్కీములను రద్దు చేయడం వైఫల్యమా
*క్షీనించిన అడవుల పునరుద్దరణ యత్నాలు
*కొత్త పాలనకు జగన్ శ్రీకారం చుట్టారు
*ఎపిలో లాయర్ల సంక్షేమానికి 100 కోట్ల నిధి
*పాదాయాత్రలో వచ్చిన ఆలోచనలే ఇవన్ని
*లక్జరీ నౌక-గదుల్లోనే 200 మంది భారతీయులు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info