A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
9మంది మృతిపై విచారణ జరుగుతోంది
Share |
May 26 2020, 2:00 pm

వ‌రంగ‌ల్ న‌గ‌ర శివారు గొర్రెకుంట బావిలో ప‌డి మృతి చెందిన 9 మంది మృతి ఘ‌ట‌న‌పై స‌మ‌గ్ర విచార‌ణ చేప‌ట్టామ‌ని,నిజానిజాలు తెలిశాక చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని, ఈ లోగా మృతుల కుటుంబాలు కోరుకున్న విధంగా ఇక్క‌డే అంతిమ క్రియ‌లు చేయ‌డం కానీ, కావాలంటే వారి వారి సొంతూళ్ళ‌కు వాళ్ళ‌ని పంపించడం కానీ చేస్తామ‌ని రాష్ట్ర పంచాయ‌తీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి స‌ర‌ఫ‌రాశాఖ మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు అన్నారు. గొర్రెకుంట మృతుల శ‌వాల‌ను
మంత్రి వ‌రంగ‌ల్ లోని ఎంజిఎంలో సంద‌ర్శించి, ప‌రిశీలించారు. అనంత‌రం గొర్రెకుంట ఘ‌ట‌న‌ల‌కు గ‌ల కార‌ణాలేంట‌ని
వ‌రంగ‌ల్ రూర‌ల్ క‌లెక్ట‌ర్ హ‌రిత‌, పోలీస్ క‌మిష‌న‌ర్ ర‌వింద‌ర్ ల‌ను అడిగి తెలుసుకున్నారు. వైద్యుల‌తో మాట్లాడారు.
మృతుల కుటుంబాల‌ను ప‌రామ‌ర్శించారు. మృతుల శ్ర‌ద్ధాంజ‌లి ఘ‌టించారు. త‌న ప్ర‌గాఢ సానుభూతిని, సంతాపాన్ని
తెలిపారు.

అనంత‌రం మంత్రి ఎర్ర‌బెల్లి మీడియాతో మాట్లాడారు. గొర్రెకుంట ఓ పాత బావిలో నిన్న నాలుగు శ‌వాలు, ఈ రోజు ఐదు
శ‌వాలు బ‌య‌ట‌ప‌డ్డాయి. మృతుల‌లో ఆరుగురు ఒకే కుటుంబానికి చెందిన ప‌శ్చిమ‌బెంగాల్  వారు కాగా, ఇద్ద‌రు బీహార్
కార్మికులు, మ‌రో వ్య‌క్తి త్రిపుర‌కు చెందిన వ‌ల‌స కార్మికుడిగా గుర్తించారన్నారు. వీళ్ళంతా కేవ‌లం వ‌ల‌స కూలీలు మాత్ర‌మే
కాదు. చాలా కాలంగా వాళ్ళు గొర్రెకుంట ప‌రిస‌రాల్లోనే ఉంటున్నారు. కొంద‌రి మృతికి కుటుంబ త‌గాదాలు కార‌ణంగా
తెలుస్తున్న‌ది. మిగ‌తా వాళ్ళ చావుకి కార‌ణాలు తెలియ‌రాలేదు. పోస్టు మార్టం రిపోర్టు వ‌చ్చాక, పోలీసు విచార‌ణ‌లో పూర్తి
వివ‌రాలు తెలుస్తాయి. ఆ వివ‌రాలు వ‌చ్చాక చ‌ర్య‌లు తీసుకుంటామ‌న్నారు. ఈ లోగా ఆ కుటుంబాలు కోరుకున్న  విధంగా
ప్ర‌భుత్వం సాయం చేయ‌డానికి సిద్ధంగా ఉంద‌న్నారు. వారు ఇక్క‌డే అంతిమ క్రియ‌లు కావాల‌నుకుంటే ప్ర‌భుత్వ‌మే
ఉచితంగా చేస్తుంది. లేదంటే, వారి గ్రామాల‌కు వాళ్ళ శ‌వాలను పంపించ‌డానికి ఏర్పాట్లు చేస్తాం. కొన్ని మృత దేహాల‌కు
సంబంధించిన వారెవ‌రూ లేరు. అన్ని విధాలుగా వారిని ఆదుకోవాల‌ని సిఎం కెసిఆర్ ఆదేశించారు. వారి ఆదేశాల మేర‌కు
న‌డుచుకుంటాం. అని మంత్రి ఎర్ర‌బెల్లి వివ‌రించారు.
అయితే, జ‌రిగిన ఘ‌ట‌న‌ల‌పై మంత్రి ఎర్ర‌బెల్లి తీవ్ర దిగ్భ్రాంతిని వ్య‌క్తం చేశారు. ఇలాంటి ఘ‌ట‌న‌లు విచార‌క‌ర‌మ‌న్నారు.
కూలీలు, వ‌ల‌స కూలీల‌ను ఆదుకోవ‌డంలో ప్ర‌భుత్వం ముందుంద‌న్నారు. మృతుల కుటుంబాల‌కు ప్ర‌భుత్వం అండ‌గా
ఉంటుంద‌ని భ‌రోసానిచ్చి ఓదార్చారు.
ప్ర‌భుత్వం కూలీల‌కు, వ‌ల‌స కూలీల‌కు బాస‌ట‌గా నిలుస్తుంద‌ని మంత్రి తెలిపారు. క‌రోనా క‌ష్ట కాలంలో ఆదుకున్న
విష‌యాన్ని ఆయ‌న గుర్తు చేశారు. మంత్రి వెంట స్థానిక ప్ర‌జాప్ర‌తినిధులు. అధికారులు, పోలీసు అధికారులు, వైద్యులు
ఉన్నారు.

tags : errabelli

Latest News
*చంద్రబాబుపైనే కాదు..ఈనాడు, ఎబిఎన్ పై పోరు..జగన్
*లాక్ డౌన్ అమలులో కేంద్రం విఫలం-రాహుల్
*8148 పరీక్షలు-48 పాజిటివ్
*ఎపిలో కూడా విమాన సర్వీసులు మొదలు
*2.40లక్షల తిరుమల లడ్డూల విక్రయం
*630 విమాన సర్వీసులు రద్దు అయ్యాయి
*నరసాపురం ప్రాంతంలో మెడికల్ కాలేజీ
*ఐవైఆర్ కృష్ణారావు 2 రకాలుగా మాట్లాడారా
*ఇంతకాలం ఇంద్రభవనంలో ఉండి వచ్చారు
*ఉదయగిరి నీటి సమస్యపై వెంకయ్య దృష్టి
*ఏజెన్సిలో కాళ్ల వాపుపై సి.ఎమ్ ఆదేశాలు
*సి.ఎమ్. సందేశం 5 నిమిషాల్లోనే ప్రజల చెంతకు
*ఎపి పాలనలో హుందాతనం,బాద్యతాయుతం
*టిడిపి కి మరో షాక్-మరో ఎమ్మెల్యే గుడ్ బై
*ఎపిలో బిజెపి విద్వేషపూరిత రాజకీయం
*చంద్రబాబు నోటికి ఏది వస్తే అది మాట్లాడి..
*కేంద్ర మంత్రి క్వారంటైన్ కు వెళ్లక్కర్లేదా
*రియల్ ఎస్టేట్ ను కరోనా ముంచేసింది
*లాక్ డౌన్ సొడిగిస్తే ఆర్ధిక వినాశనమే
*టిడిపి స్కీములను రద్దు చేయడం వైఫల్యమా
*క్షీనించిన అడవుల పునరుద్దరణ యత్నాలు
*కొత్త పాలనకు జగన్ శ్రీకారం చుట్టారు
*ఎపిలో లాయర్ల సంక్షేమానికి 100 కోట్ల నిధి
*పాదాయాత్రలో వచ్చిన ఆలోచనలే ఇవన్ని
*లక్జరీ నౌక-గదుల్లోనే 200 మంది భారతీయులు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info