A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
బూతులు తిట్టిన మంత్రి-సి.ఎమ్.వార్నింగ్
Share |
September 22 2020, 10:49 am

కర్నాటకలో ఒక మంత్రిగారు ఒక మహిళా రైతు కార్యకర్తను బూతులు తిట్టి ఇబ్బందిలో పడ్డారు.మధుస్వామి అనే ఈ మంత్రి ఎక్కడ తిట్టాడో కాని, సంబందిత వీడియో వైరల్ అయింది. అది ముఖ్యమంత్రి బిఎస్ ఎడ్యూరప్ప దృష్టికి కూడా వెళ్లింది. ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేశాయి. దాంతో ముఖ్యమంత్రి ఆ మంత్రిని పిలిచి మందలించారు.ఆ విషయాన్ని స్వయంగా ఎడ్యూరప్పే చెప్పారు. న్యాయ,పార్లమెంటరీ శాఖల మంత్రి అయిన మదుస్వామి ఒక మహిళ పట్ల అసభ్యకర భాష వాడారని,ఆ విషయం తనకు తెలిసిన తర్వాత పిలిచి మందలించానని, మరోసారి ఇలా జరగడానికి వీలులేదని స్పష్టం చేశానని అన్నారు. బాదిత మహిళను కూడా పిలిచి మాట్లాడతానని ఆయన వివరణ ఇచ్చారు. కాగా మదుస్వామి కూడా ఈ ఘటనపై క్షమాపణ చెప్పారు.

tags : karanataka

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info