A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
అయిపోయిన పెళ్లికి పవన్ బాజాలు
Share |
May 27 2020, 2:37 am

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌‌ అయిపోయిన పెళ్లికి బాజాలు కొడుతున్నారని దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఎద్దేవ చేశారు. లాక్‌డౌన్‌ కారణంగా ఇబ్బందులు పడుతున్న పురోహితులకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఇదివరకే ఆర్థిక సాయం ప్రకటించిందని ఆయన అన్నారు. ప్రభుత్వం సాయం ప్రకటించిన తరువాత కూడా వారిని ఆదుకోవాలంటూ పవన్‌ కల్యాణ్‌‌ ప్రకటన చేసి వారిపై కపట ప్రేమ చూపుతున్నారని ఆయన అన్నారు.ఇదివరకే సాయం ప్రకటించాకా మళ్లీ డిమాండ్ ఏంటండీ పవన్‌ కల్యాణ్‌‌.. కామెడీ కాకుంటే..’ అని ఆయన అన్నారు. లక్షల పుస్తకాలు చదివి ఉన్నమతి పోయిందా అని ప్రశ్నించారు. హైదరాబాదులో కూర్చున్న పవన్‌ కళ్లకు సంక్షేమ పథకాల పంపిణీ కనబడటం లేదేమో అని అన్నారు. పార్ట్ టైం రాజకీయాలు చేసే ప్యాకేజీ పవన్ కళ్యాణ్ నిద్ర లేచిన తర్వాత నిజాలు తెలుసుకొని మాట్లాడటం మంచిదని సూచించారు.

tags : vellampalli

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info