A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
పులివెందుల మెడికల్ కాలేజీకి ఏర్పాట్లు
Share |
May 27 2020, 2:45 am

పులివెందుల మెడికల్ కాలేజీ కి సంబందించి ఆగష్టుకల్లా టెండర్ల ప్రక్రియ మొదలుపెట్టి త్వరితగతిన పూర్తిచేసి, ఈ సంవత్సరంలోగా మెడికల్ కాలేజీ పనులు ప్రారంభించాలనిఎపి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్ అధికారులను ఆదేశించారు.పులివెందుల నియోజకవర్గ అబివృద్ది పనులపై ఆయన సమీక్ష నిర్వహించారు. జీఎన్‌ఎస్‌ఎస్‌ మెయిన్ కెనాల్-చక్రాయపేట లిఫ్ట్ ఇరిగేషన్‌ స్కీం పనుల పురోగతిపై సమాచారం అడిగారు. వీలైనంత త్వరగా పనులు గ్రౌండింగ్‌ కావాలని అధికారులతో అన్నారు. యుద్ధప్రాతిపదికన ఈనెలాఖరుకల్లా జ్యుడిషియల్ ప్రివ్యూ పూర్తిచేసి, టెండర్ల ప్రక్రియకు సిద్ధం కావాలని వైఎస్‌ జగన్‌ తెలిపారు.
వేంపల్లి మండలంలోని అలవలపాడు, పెండ్లూరు చెరువు, జీఎన్‌ఎస్‌ఎస్‌ నుంచి పిబిసి కెనాల్‌కు రూ.46.5 కోట్లతో లిఫ్ట్‌ స్కీంకు పాలనాపరమైన అనుమతుల మంజూరుకు సీఎం ఆదేశించారు. పులివెందులలో అరటి స్టోరేజీ, ప్రాసెసింగ్‌ యూనిట్‌తోపాటు అనంతపురం, కడప వంటి అరటి సాగు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ప్రాసెసింగ్‌ యూనిట్లు సిద్ధం చేయాలన్నారు. అరటి, టమాటా, బత్తాయి పంటల దిగుబడి సమయంలో సమస్యలు రాకూడదని సూచించారు. రైతులు నష్టపోకుండా శాశ్వత పరిష్కారం ఉండాలన్నారు.

tags : jagan

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info