A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
తెలంగాణలో కరోనా టెస్టులు ఎక్కడ
Share |
May 27 2020, 2:59 am

అటు దేశంలోనూ, ఇటు రాష్ట్రంలోనూ కరోనా టెస్టులు సరిగా చెయ్యడం లేదని తెలంగాణ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. దేశంలో సగటున ప్రతి పది లక్షల మందికి 16 వేల మందికి మాత్రమే టెస్టులు జరుగుతున్నాయని ఆయన అన్నారు. తెలంగాణలో ప్రతి 10 లక్షల మందికి 650 టెస్టులు మాత్రమే చేశారని అన్నారు.జగిత్యాలలో ఆయన మాట్లాడారు. మే 14 వరకు రాష్ట్రంలో కేవలం 20 వేల మందికే కరోనా టెస్టులు చేశార‌ని చెప్పారు. రోజూ 250 మందికి మాత్రమే టెస్టులు చేస్తున్నార‌న్నారు.ముఖ్యమంత్రి కసిఆర్ డిక్షనరిలో ఎన్ని తిట్లు ఉంటే అన్ని తిడుతున్నాడని ఆయన చెప్పారు... సూర్యాపేట జిల్లాలో అధికారుల పర్యటన తర్వాత అస్స‌లు టెస్టులే చెయ్యలేదని అన్నారు . ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచనలనూ ఇక్కడ పట్టించుకోలేదని అన్నారు. కరోనా టెస్టుల విషయంలో హైకోర్టు మొట్టికాయలు వేసిందని ఉత్తంకుమార్ ఎద్దేవ చేశారు.

tags : telangana, carona

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info