A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
వైసిపి విజయోత్సవాలలో మార్పులు
Share |
September 22 2020, 9:12 am

హైకోర్టు నుంచి ఎదురు అవుతున్న తలనొప్పిని దృష్టిలో ఉంచుకుని వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ తన విజయోత్సవ కార్యక్రమాలలో మార్పు చేసుకున్నట్లుగా ఉంది. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వార్షికోత్సవం సందర్భంగా ఎలాంటి రాజకీయ కార్యక్రమాలు చేపట్టవద్దని పార్టీ శ్రేణులకు సూచించారు. సేవా కార్యక్రమాలు మాత్రమే చేయాలని కార్యకర్తలకు ఆ పార్టీ పిలుపునిచ్చారు. వైఎస్సార్‌సీపీ అఖండ విజయం సాధించి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా.. ఈ నెల 23 నుంచి 30 వరకు పార్టీ జెండా ఆవిష్కరణలతో పాటు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించాలని తొలుత భావించామని.. కానీ కరోనా నేపథ్యంలో రాజకీయ పరమైన కార్యక్రమాలు నిర్వహించడం మంచిది కాదని, జెండా ఆవిష్కరణ కార్యక్రమాలు నిర్వహించవద్దని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారని ఆయన తెలిపారు. పండ్లు పంపిణీ, తదితర సేవా కార్యక్రమాలు చేయదలిచిన వారు లాక్‌డౌన్ నిబంధనల మేరకు.. ప్రత్యక్షంగా పాల్గొనకుండా స్వచ్ఛంద సేవా సంస్థల నిర్వాహకులు, వార్డు వాలంటీర్ల ద్వారా బాధితులకు సాయం అందించాలని ఆయన సూచించారు.

tags : sajjala

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info