A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
దశలవారీగా సినిమా షూటింగ్ లకు అనుమతి
Share |
September 22 2020, 9:10 am

దశలవారీగా సినిమాల షూటింగ్ లకు అనుమతి ఇస్తామని ముఖ్యమంత్రి కెసిఆర్ తెలిపారు. సినీ రంగ ప్రముఖులు ముఖ్యమంత్రితో భేటీ అయ్యారు. లాక్ డౌన్ నిబంధనలు, కోవిడ్ వ్యాప్తి నివారణ మార్గదర్శకాలు పాటిస్తూ షూటింగులు నిర్వహించేలా ఎవరికి వారు నియంత్రణ పాటించాల్సి ఉంటుందని కెసిఆర్ అన్నారు. సినిమా షూటింగులు ఎలా నిర్వహించుకోవాలనే విషయంలో విధి విధానాలు రూపొందించాలని సీఎం అధికారులను ఆదేశించారు. సినిమా పరిశ్రమపై ఆధారపడి లక్షలాది మంది జీవిస్తున్నందున ప్రిప్రొడక్షన్, షూటింగుల నిర్వహణ, థియేటర్లలో ప్రదర్శనలను దశలవారీగా పునరుద్ధరించాల్సిన అవసరం ఉందని సీఎం అభిప్రాయపడ్డారు. తక్కువ మందితో, ఇండోర్‌లో చేసే వీలున్న ప్రిప్రొడక్షన్ పనులు మొదట ప్రారంభించుకోవాలని సీఎం చెప్పారు. తర్వాత దశలో జూన్ మాసంలో సినిమా షూటింగులు ప్రారంభించాలని చెప్పారు. చివరగా పరిస్థితిని బట్టి, సినిమా థియేటర్ల పునఃప్రారంభంపై నిర్ణయం తీసుకుంటామని ముఖ్యమంత్రి అన్నారు.

tags : kcr,cenemas

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info