A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
రంగుల జీఓ మళ్లీ రద్దు- ఎపి హైకోర్టు
Share |
September 22 2020, 10:30 am

ఎపిలో హైకోర్టు మరోసారి ప్రభుత్వ వ్యతిరేక తీర్పు ఇచ్చింది. పంచాయతీ భవనాలకు రంగులు వేయడానికి సంబందించి ఇచ్చిన జిఓ 623ని హైకోర్టు రద్దు చేసిందన్న సమాచారం వచ్చింది. ప్రభుత్వ కార్యాలయాలపై ఉన్న పార్టీ రంగులను తొలగించాలని న్యాయస్థానం ఆదేశాలు జారీ చేస్తే.. ప్రభుత్వం మరో రంగును అదనంగా వేయడం కోర్టు ఆదేశాలను ధిక్కరించడమేనని సోమయాజులు అనే న్యాయవాది హైకోర్టులో పిటిషన్ వేశారు. హైకోర్టు, సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలను ప్రభుత్వం పాటించడం లేదని సోమయాజులు ఆరోపించారు. ప్రస్తుతం ఉన్న 3 రంగులకు అదనంగా వేస్తున్న రంగు పార్టీ రంగు కాదని ప్రభుత్వ న్యాయవాది కోర్టుకు తెలిపినా, న్యాయమూర్తి అందుకు అంగీకరించలేదు. ప్రభుత్వం కోర్టు గైడ్ లైన్స్ పాటించలేదని చెబుతూ, జీవోను రద్దు చేసింది. అంతేకాక ఛీప్ సెక్రటరీ, సిఈసి, పంచాయతీరాజ్ శాఖ కార్యదర్శి వివరణ ఇవ్వాలని ఆదేశించింది. దీనిపై కోర్టు దిక్కారం కూడా నమోదు చేస్తున్నట్లు కోర్టు తెలిపింది. ఈ నెల ఇరవైఎనిమిదిన ఇది విచారణకు రావచ్చని వార్తలు సూచిస్తున్నాయి.

ఏ రంగులు వేయాలో హైకోర్టు చెబితే ఇంత గొడవ లేదు కదా..ఏమిటో ప్రభుత్వానికి,హైకోర్టుకు మద్య రంగుల రగడ.అర్దం కాదు.

tags : highcourt, colours

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info