A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
డాక్టర్ సుదాకర్ కేసు-ఎపి హైకోర్టు తీవ్ర నిర్ణయం!
Share |
May 26 2020, 2:26 pm

విశాఖపట్నంలో నర్సీపట్నం డాక్టర్ అయిన సుధాకర్ ఘటనకు సంబందించి సిబిఐ కేసు నమోదు చేసి విచారణ చేయాలని ఎపి హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. సుధాకర్ పై దాడి చేసిన పోలీసులపై కేసు నమోదు చేయాలని హైకోర్టు ఆదేశించడం విశేషం.ఎనిమిది వారాలలో నివేదిక ఇవ్వాలని సిబిఐకి కోర్టు ఉత్తర్వులు ఇచ్చిందన్న సమాచారం వచ్చింది.కొంతకాలం క్రితం సుధాకర్ ను ప్రభుత్వం సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఆయన విశాఖపట్నంలో నడిరోడ్డు మీద బూతులు తిడుతూ హల్ చల్ చేయగా,స్థానికులు పోలీసులకు పిర్యాదు చేశారు. ఆ క్రమంలో పోలీసులు వచ్చి ఆయనను అదుపు చేసే క్రమంలో ఆయనపై దాడి చేశారని ఆరోపణలు వచ్చాయి.దాంతో ఆ కానిస్టేబుల్ ను అదికారులు సస్పెండ్ చేశారు. ఆ తర్వాత ఆ డాక్టర్ పై కేసు పెట్టి ఆస్పత్రికి తరలించారు. అతని మానసిక పరిస్థితి బాగోలేదని మానిసక ఆస్పత్రికి తరలించారు. అయితే హైకోర్టు ఈ కేసును టిడిపి మాజీ ఎమ్మెల్యే అనిత రాసిన లేఖపై స్పందించి విచారణ చేపట్టింది. విశాఖ మెజిస్ట్రేట్ ద్వారా సుదాకర్ వాంగ్మూలం తీసుకోవాలని ఆదేశించింది. మరి అది ఏమైందో కాని ఈ ఘటనపై ఏకంగా సిబిఐ విచారణకు ఆదేశించి హైకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది.

హైకోర్టు ఇలాంటి చిన్న కేసులలో ఎందుకు ఇంత తీవ్రంగా స్పందించిందో తెలియదు. పిచ్చుక మీద బ్రహ్మాస్త్రమా? కానిస్టేబుళ్లపై సిబిఐ విచారణా?మరి బూతులు తిట్టిన డాక్టర్ కు హైకోర్టు రక్షణ ఇస్తోందని అనుకోవాలా? సిబిఐ విచారణలో ఏమి తేలుతుందో చూడాలి.

tags : ap, highcourt,

Latest News
*చంద్రబాబుపైనే కాదు..ఈనాడు, ఎబిఎన్ పై పోరు..జగన్
*లాక్ డౌన్ అమలులో కేంద్రం విఫలం-రాహుల్
*8148 పరీక్షలు-48 పాజిటివ్
*ఎపిలో కూడా విమాన సర్వీసులు మొదలు
*2.40లక్షల తిరుమల లడ్డూల విక్రయం
*630 విమాన సర్వీసులు రద్దు అయ్యాయి
*నరసాపురం ప్రాంతంలో మెడికల్ కాలేజీ
*ఐవైఆర్ కృష్ణారావు 2 రకాలుగా మాట్లాడారా
*ఇంతకాలం ఇంద్రభవనంలో ఉండి వచ్చారు
*ఉదయగిరి నీటి సమస్యపై వెంకయ్య దృష్టి
*ఏజెన్సిలో కాళ్ల వాపుపై సి.ఎమ్ ఆదేశాలు
*సి.ఎమ్. సందేశం 5 నిమిషాల్లోనే ప్రజల చెంతకు
*ఎపి పాలనలో హుందాతనం,బాద్యతాయుతం
*టిడిపి కి మరో షాక్-మరో ఎమ్మెల్యే గుడ్ బై
*ఎపిలో బిజెపి విద్వేషపూరిత రాజకీయం
*చంద్రబాబు నోటికి ఏది వస్తే అది మాట్లాడి..
*కేంద్ర మంత్రి క్వారంటైన్ కు వెళ్లక్కర్లేదా
*రియల్ ఎస్టేట్ ను కరోనా ముంచేసింది
*లాక్ డౌన్ సొడిగిస్తే ఆర్ధిక వినాశనమే
*టిడిపి స్కీములను రద్దు చేయడం వైఫల్యమా
*క్షీనించిన అడవుల పునరుద్దరణ యత్నాలు
*కొత్త పాలనకు జగన్ శ్రీకారం చుట్టారు
*ఎపిలో లాయర్ల సంక్షేమానికి 100 కోట్ల నిధి
*పాదాయాత్రలో వచ్చిన ఆలోచనలే ఇవన్ని
*లక్జరీ నౌక-గదుల్లోనే 200 మంది భారతీయులు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info