A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఆర్బిఐ కొత్త చర్యలు పనిచేస్తాయా
Share |
May 27 2020, 1:15 am

కరోనా వైరస్, లాక్ డౌన్ నేపద్యంలో ఆర్దిక పునరుద్దరణకు కేంద్రం, ఆర్బిఐ రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాయి. తాజాగా ఆర్బిఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ మరి కొన్ని చర్యలు తీసుకుంటున్నట్లు ప్రకటించారు.రెపో రేటు 4.40 నుంచి 4 శాతానికి తగ్గించారు. ఈ నిర్ణయంతో తీవ్ర ఒత్తిడిలో ఉన్న పరిశ్రమ వర్గాలకు కొంతమేర ఊరట లభించవచ్చు.
టర్మ్ లోన్ లపై ఉన్న మారటోరియం మరో 90 రోజులు పొడిగిస్తారు. ఆగస్టు వరకు ఇది కొనసాగుతుంది.ఎగ్జిమ్ బ్యాంకుకు ఆర్ బీఐ నుంచి రూ.15వేల కోట్ల లైన్ ఆఫ్ క్రెడిట్ ఇస్తారు. రివర్స్‌ రెపో సైతం 3.75 శాతం నుంచి 3.35 శాతానికి తగ్గింది. కాగా.. మార్చి 1 నుంచి మే 31వరకూ మూడు నెలలపాటు రుణ చెల్లింపుల వాయిదాలపై విధించిన మారటోరియంను తాజాగా ఆగస్ట్‌ 31వరకూ పొడిగిస్తున్నట్లు శక్తికాంతదాస్‌ పేర్కొన్నారు. కోవిడ్‌-19 కట్టడికి దేశవ్యాప్తంగా అమలు చేస్తున్న లాక్‌డవున్‌ నేపథ్యంలో ఆర్థిక కార్యకలాపాలు భారీగా కుంటుపడినట్లు శక్తికాంత్‌ దాస్‌ పేర్కొన్నారు.

tags : rbi

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info