A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఈనాడు -రంగనాయకమ్మ- టిడిపి- ప్రాధాన్యత
Share |
May 26 2020, 3:53 pm

తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా ,లేదా అబిమానిగా ఎపి ప్రభుత్వం పై ద్వేషపూరిత పోస్టింగులు పెట్టిన రంగనాయకమ్మ ను సిఐడి వారు విచారించిన వార్తకు ఈనాడు పత్రిక ఇచ్చిన ప్రాదాన్యత ఆశ్చర్యం కలిగిస్తుంది. కనీసం ఆమె టిడిపి అభిమాని అని కూడా రాయకుండా ఈనాడు జాగ్రత్తపడి ఆ పత్రిక మరో సారి తన వైఖరి మారదని,జగన్ కు వ్యతిరేకంగానే దుష్ప్రచారం చేస్తామని చెప్పినట్లుగా ఉంది.పైగా రంగనాయకమ్మ ఏదో గొప్ప పనిచేసినట్లు ప్రజాభిప్రాయమే చెప్పానన్న ఆమె వ్యాఖ్యను హెడింగ్ గా పెట్టింది. పోని గతంలో కూడా ఇలాగే ఈనాడు వ్యవహరించిందా అంటే ,చంద్రబాబు టైమ్ లో ఎంతో మంది సామాజిక మాద్యమాల కార్యకర్తలు,లేదా వైసిపి అబిమానులను పోలీసులు హైదరాబాద్ నుంచి తీసుకు వెళ్లి జైళ్లలో పెట్టినా, పోలీస్ స్టేషన్ ల చుట్టూ తిప్పినా, ఎప్పుడూ ఒక్క మాట కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాయని ఈనాడు పత్రిక ఇప్పుడు తన వికృత తత్వాన్ని మరోసారి బయటపెట్టుకున్నట్లుగా ఉంది. అదే సమయంలో ప్రభుత్వం పరిశ్రమలకు 900కోట్లు ఇస్తున్న వార్త కన్నా, మే నెలలో ఉద్యోగులకు పూర్తి జీతాలు ఇస్తున్నారన్న వార్తకన్నా టిడిపి నేతలు ఎసి గదులలో చేసిన ధర్నాలకే అత్యధిక ప్రాధాన్యత ఇవ్వడాన్ని అంతా గమనించారు. విశేషం ఏమిటంటే సిఐడి వారికి మాత్రం రంగనాయకమ్మ తెలివిగా సమాధానం ఇచ్చింది. బహుశా లాయర్ల సలహా అయి ఉండవచ్చు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టింగ్ లు పెట్టాలనేది తన అభిమతం కాదని ప్రజల అభిప్రాయాలను చెప్పానని , అవి పెట్టడం తప్పు అని కూడా తెలియదని ఆమె చెప్పాను. అమ్మఒడి పథకం దుర్వినియోగం అవుతోందని, ప్రభుత్వం మంచి చేయాలనుకుంటే కొందరు అందుకు విరుద్ధంగా చేయాలని ప్రయత్నిస్తున్నారని పోస్ట్ చేశానని చెప్పాను. ఆమె వృద్దురాలు అంటూ ఈనాడు పనికట్టుకుని రాయడంలో ఆంతర్యం తెలుసుకోవడం కష్టం కాదు కదా..

tags : eenadu

Latest News
*చంద్రబాబుపైనే కాదు..ఈనాడు, ఎబిఎన్ పై పోరు..జగన్
*లాక్ డౌన్ అమలులో కేంద్రం విఫలం-రాహుల్
*8148 పరీక్షలు-48 పాజిటివ్
*ఎపిలో కూడా విమాన సర్వీసులు మొదలు
*2.40లక్షల తిరుమల లడ్డూల విక్రయం
*630 విమాన సర్వీసులు రద్దు అయ్యాయి
*నరసాపురం ప్రాంతంలో మెడికల్ కాలేజీ
*ఐవైఆర్ కృష్ణారావు 2 రకాలుగా మాట్లాడారా
*ఇంతకాలం ఇంద్రభవనంలో ఉండి వచ్చారు
*ఉదయగిరి నీటి సమస్యపై వెంకయ్య దృష్టి
*ఏజెన్సిలో కాళ్ల వాపుపై సి.ఎమ్ ఆదేశాలు
*సి.ఎమ్. సందేశం 5 నిమిషాల్లోనే ప్రజల చెంతకు
*ఎపి పాలనలో హుందాతనం,బాద్యతాయుతం
*టిడిపి కి మరో షాక్-మరో ఎమ్మెల్యే గుడ్ బై
*ఎపిలో బిజెపి విద్వేషపూరిత రాజకీయం
*చంద్రబాబు నోటికి ఏది వస్తే అది మాట్లాడి..
*కేంద్ర మంత్రి క్వారంటైన్ కు వెళ్లక్కర్లేదా
*రియల్ ఎస్టేట్ ను కరోనా ముంచేసింది
*లాక్ డౌన్ సొడిగిస్తే ఆర్ధిక వినాశనమే
*టిడిపి స్కీములను రద్దు చేయడం వైఫల్యమా
*క్షీనించిన అడవుల పునరుద్దరణ యత్నాలు
*కొత్త పాలనకు జగన్ శ్రీకారం చుట్టారు
*ఎపిలో లాయర్ల సంక్షేమానికి 100 కోట్ల నిధి
*పాదాయాత్రలో వచ్చిన ఆలోచనలే ఇవన్ని
*లక్జరీ నౌక-గదుల్లోనే 200 మంది భారతీయులు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info